Nani Nithiin : హీరోగా మాత్రమే కాదు , నిర్మాతగా కూడా నేచురల్ స్టార్ నాని ఇండస్ట్రీలో సక్సెస్ లు చూసారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘అ!’ అనే చిత్రం తో ఆయన నిర్మాతగా మొదటి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వడమే కాకుండా, ప్రశాంత్ వర్మ వంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఈ చిత్రం ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత నాని నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్’, ‘హిట్ 2’, ‘హిట్ 3’, ‘కోర్ట్’ వంటి చిత్రాలు కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇలా నిర్మాతగా వరుసగా సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న నాని , ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కి నిర్మాతగా మారబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ టాపిక్ గా మారింది.
ఈ సినిమాలో హీరో గా నితిన్ , హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటించనున్నారు. ‘దండోర’ వంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన మురళీధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా సాగుతోంది. నాని ఒక సినిమా స్క్రిప్ట్ ని ఒకే చేసారంటే కచ్చితంగా అందులో విషయం ఉంటుందని అందరూ బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతారు. పైగా విషయం ఉన్న డైరెక్టర్ కావడంతో , ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రాకముందే ఆడియన్స్ లో అద్భుతమైన బజ్ ఏర్పడింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు నాని. గతం లో నితిన్ హీరోగా నటించిన ‘అల్లరి బుల్లోడు’ చిత్రానికి నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అలాంటి నాని ఇప్పుడు అదే హీరోతో ఒక సినిమాని నిర్మించబోతుండడం. ‘అల్లరి బుల్లోడు’ టైమ్ నుండే నుండే నాని తో నితిన్ కి మంచి సాన్నిహిత్యం ఉంది.
ఆ సాన్నిహిత్యం ఇప్పుడు ఆడియన్స్ కి ఒక మెమరబుల్ మూవీ ని సిద్ధం అవుతోంది. గతంలో నుండి సరైన సూపర్ హిట్ లేక తీవ్రమైన ఇబ్బంది పడుతున్న నితిన్, ఇప్పుడు మెల్లగా మరోసారి గాడిలో పడుతున్నట్టే అనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన నర్రి , సోము దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని షూటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ వీడియోస్ ని చూస్తుంటే ఇందులో నితిన్ మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలో నితిన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో నితిన్ కం బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి.

