భారత్తో జరిగే టి-20కి ముందు బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ తనకా చివంగాపై ఐసిసి క్రమశిక్షణ చర్య తీసుకుంది. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో అతడు ఐసిసి ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. ఐసిసి మీడియా ప్రకటన ప్రకారం.. సిబ్బంది మరియు సహాయక సిబ్బందికి సంబంధించిన ప్రవర్తనా ఆర్టికల్ 2.3ను చివంగ ఉల్లంఘించాడు. ఈ నిబంధన అంతర్జాతీయ మ్యాచ్లలో వినిపించేలా అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని నిషేధిస్తుంది.
బంగ్లాదేశ్ కార్యక్రమంలో సహచర ఆటగాడు ఇన్నోసెంట్ కాయ నుంచి ఆశించినంత వేగంగా త్రో రా నిరాశ చెందిన చివంగా.. అందరికీ వినిపించేలా అసభ్య పదజాలం ఉపయోగించినట్లు ఐసిసి గుర్తించింది. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ డేవిడ్ గిల్బర్ట్ విధించిన శిక్షను చివకంగా అంగీకరించాడు. గత 24 నెలల్లో చివంగా చేసిన తొలి క్రమశిక్షణ ఉల్లంఘన ఇదే కావడంతో అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ మాత్రమే చేరింది.

