Joseph Ravan : ముసుగు తొలగిపోతోంది. తెర వెనుక ఉన్న చీకటి శక్తులు.. వెలుగులోకి వస్తున్నాయి. వారి లక్ష్యాలు.. దానికోసం ఎంపిక మార్గాలు బయట పడుతున్నాయి. పైకి పెట్టింది ప్రశ్న అనే పేరు మాత్రమే.. కానీ దాని వెనుక ఉన్న పొలిటికల్ టార్గెట్లు.. కుట్రలు ఇప్పుడు బయట పడుతున్నాయి.. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆటలో అరటిపండు కేవలం రావణ్ మాత్రమే. కథ మొత్తం గగనది.. దాని వెనుక ఉన్నది ఓ నాయకుడు.
ప్రశ్న ఛానల్ పెట్టింది జోసెఫ్ అలియాస్ రావణ్. మొదట్లో సజావుగానే సాగింది. ఆ తర్వాత ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా మారింది. ఈ దశలో ప్రశ్న ఛానల్ లోకి గగన వచ్చేసింది.. సీఈవోగా మారింది. ఛానల్ వ్యవహారాలు మొత్తం తానే చూసింది. కొన్ని సందర్భాల్లో రావణ్ తో కలిసి వీడియోలు చేసేది. షార్ట్‌లు కూడా చేసేది. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా వ్యతిరేకించే విధంగా ఉండేవి. కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అనుచరులపై వీడియోలు కూడా పెట్టేవారు.. బండ్ల గణేష్ మీద అత్యంత దారుణంగా వీడియోలు రూపొందించేవారు.
గగన గన్నవరం పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన తర్వాత.. పోలీసులు ఆమెను నిర్మానుషమైన ప్రాంతంలో మహిళా పోలీసు అధికారుల సమక్షంలో విచారణ సాగించారు. ఈ నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గగనది బళ్లారి ప్రాంతం. ఈమెకు రాము అనే వ్యక్తితో పెళ్లయింది. గగన ఒక బొటిక్ నిర్వహించేది. అక్కడికి ఇంద్రసేన నాయుడు వచ్చేవాడు. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ తర్వాత ఇంద్రసేన నాయుడుతో గగన ఉండటం మొదలుపెట్టింది. రాము మీద అనేక రకాలుగా కేసులు పెట్టింది. గగన ఒత్తిడి తట్టుకోలేక రాము ఒక దశలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
రాముకు పూర్తిగా దూరం జరిగిపోయిన గగన ఇంద్రసేనకు బాగా దగ్గరయింది.. వీరిద్దరూ విదేశాలకు తరచు వెళ్లేవారు. వివిధ వ్యాపారాలు ప్రారంభించారు. ఈ కోరికనే ప్రశ్న చానల్లో కి అనూహ్యంగా ప్రవేశించాడు ఇంద్రసేన.. ఈయనకు పొలిటికల్ లక్ష్యాలు ఉండటం.. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ద్వేషం ఉండటంతో గగన ద్వారా నడిపించాడు. గగన ప్రశ్న ఛానల్ సీఈవోను చేశాడు. ఫండింగ్ మొత్తం ఇంద్రసేన పెట్టాడు. ఆర్థిక వ్యవహారాలు మొత్తం గగనంగా చూసుకునేది. చివరికి స్క్రిప్ట్.. కంటెంట్ మొత్తం తను ఇచ్చేది. రావణ్ ద్వారా చదివేది.
ఈ వ్యవహారం ఇలా సాగిపోతుండగానే.. దళిత క్రైస్తవుల సభలో రావణ్ పాల్గొనడం.. పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడంతో ఏపీ పోలీసులు దృష్టి సారించారు. ఆ తర్వాత రావణ్ ను అరెస్ట్ చేశారు. ఎన్ని రకాలుగా కేసులు నమోదు చేసినప్పటికీ అతనికి బెయిల్ వస్తున్న నేపథ్యంలో.. అతని ఫోన్.. డిజిటల్ ఉపకరణాలు స్వాధీనం చేసుకుని అందులో ఉన్న డేటాను పరిశీలించారు. అప్పుడే పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే దాంట్లో అనేక రకాల కుట్ర కోణాలు.. బూతు వీడియోలు.. సంభాషణలు కనిపించాయి. దీంతో పోలీసులు గగనను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇంద్రసేనతో ఆమె సాగించిన వ్యవహారం గురించి చెప్పడంతో పోలీసులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి.
ఇంద్రసేన నాయుడు సోదరుడు ఉమామహేశ్వర నాయుడు వైసీపీ నాయకుడు.. గతంలో టిడిపిలో టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరించారు. దీంతో ఆయన వైసీపీకి తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ మీద ఈయనకి కూడా విపరీతమైన ద్వేషం ఉండేది. సోదరుడి ఏంటో తెలుసుకున్న ఇంద్రసేన నాయుడు ప్రశ్న ఛానల్లో పెట్టుబడులు పెట్టి.. తన సోదరుడి పొలిటికల్‌కు లక్ష్యాలకు అనుగుణంగా నడిపించడం మొదలుపెట్టాడు. అందువల్ల గన్నవరం విమానాశ్రయంలో గగనకు జగన్ దర్శన భాగ్యం సులభంగానే లభించింది. దీనికి తోడు గగన రావణ్ అరెస్ట్ అయిన ఒకరోజు వ్యవధిలోనే సెల్ఫీ వీడియో విడుదల చేసింది. అందులో జగన్ కు థాంక్స్ చెప్పింది.. ఈ అంశాలను పరిశీలించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో ఈ విషయాలు బయటపడ్డాయి. అయితే రావణ్ కేవలం ఆటలో అరటిపండు మాత్రమేనని.. అసలు కథ చాలా ఉందని పోలీసులు చెబుతున్నారు.

