తెలంగాణ:సీఎం రేవంత్ రెడ్డి(సీఎం రేవంత్ రెడ్డి) రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ పర్యటనలో భాగంగా గోదావరి,కృష్ణా బేసిన్లలోని పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్‌లు,కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అంతరాష్ట్ర జల వివాదాలపై కేంద్ర పెద్దలతో ప్రత్యేకంగా సీఎం భేటీ కానున్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనుసంధానం, ఫ్యూచర్ సిటీ మెట్రో లైన్ ప్రతిపాదనలపై కూడా చర్చించనున్నారు.రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీపై ఏఐసీసీ పెద్దలతో సీఎం చర్చించే అవకాశం ఉంది.

