చిన్న సినిమాలు vs పెద్ద సినిమాలు : ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. యంగ్ హీరోలను స్టార్ హీరోలుగా మార్చడంలో కీలకపాత్ర వహించాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో నాలుగు సినిమాలను చేసి అతన్ని స్టార్ హీరోగా మార్చడంలో తను కీలకపాత్ర వహించాడు. అలాంటి రాజమౌళి ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించడం విశేషం…మహేష్ బాబుని హీరోగా పెట్టి చేస్తున్న ‘వారణాసి’ సినిమా విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి మిస్టేక్ జరగకుండా తనే క్షుణ్ణంగా వెలుగులోకి దూసుకెళ్తుండడం విశేషం… లాంటి దర్శకుడు ఈ మధ్యకాలంలో మరొకరు ఉండరు అనేది వాస్తవం… ప్రతి రాజమౌళి తనే స్వయంగా తెలుసుకొని మరి దానికి సంబంధించిన సొల్యూషన్ ని చెప్పే ప్రయత్నం చేస్తాడు. అందుకే అతని సినిమాల్లో ప్రతి విషయం అతని ప్రమేయంతోనే జరుగుతుంది. తన లేకుండా ఏ ఒక్క డిసీజన్ కూడా సినిమా యూనిట్ తీసుకోరు… ఇక ఏది ఏమైనా కూడా తను అనుకున్నట్టుగా షూటింగ్ స్పాట్లో జరగకపోతే ఆరోజు ప్యాకప్ చెప్పి నెక్స్ట్ డే అనుకున్నది అనుకున్నట్టుగా తీసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటాడు.
రాజమౌళి సినిమాల వల్ల బడ్జెట్ పెరుగుతూనే పోతుంది తప్ప తగ్గడం లేదు. బాహుబలి సినిమాతో 500 కోట్ల బడ్జెట్ ని కేటాయించిన ఆయన ‘త్రిబుల్ ఆర్’ సినిమా కోసం 600 కోట్ల బడ్జెట్ ని పెట్టాడు. ఇక ఇప్పుడు వారణాసి సినిమా కోసం దాదాపు 1500 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. రోజురోజుకీ బడ్జెట్ పెరుగుతూ ఉండటం వల్ల సినిమాని చూస్తే ప్రేక్షకులు సినిమాల మీద ఇంట్రెస్ట్ పెట్టే అవకాశం ఉంటే పోతుంది.
బడ్జెట్ వల్ల టికెట్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. దానివల్ల సామాన్య మానవుడి పైన విపరీతంగా భారం పడుతుంది. అలాగే చిన్న సినిమాలను బతికించే పరిస్థితిలో ఎవ్వరు లేరు. 200 రూపాయల టికెట్ రేటుతో విజువల్ వండర్స్ ను చూసిన ప్రేక్షకులు అదే 200 పెట్టి చిన్న సినిమా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అందులో గ్రాండీయర్ విజువల్స్ ఏమీ ఉండవు. కాబట్టి దాన్ని టీవీలో చూసినా కూడా పెద్దగా ఇంపాక్ట్ పోయే ప్రమాదం లేదు. కాబట్టి అందరు ఓటిటి ల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. చిన్న సినిమాలు చూడడానికి థియేటర్ కి వచ్చే జనాల సంఖ్య తగ్గిపోయిందనే చెప్పాలి…
రాజమౌళి వల్ల సినిమా ఇండస్ట్రీకి భారీ నష్టమైతే వాటిల్లుతుంది. ఇక ఇప్పుడు రాబోయే వారణాసి సినిమా ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తుందో, దానివల్ల సినిమా ఇండస్ట్రీ కి ఇంకెన్ని ప్రాబ్లమ్స్ రాబోతున్నాయో తలుచుకుంటే భయమేస్తుంది… దీనితో కంప్లీట్ గా చిన్న సినిమాల దుకాణం బంద్ అయిపోయిన ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు…

