యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దుల్లో సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన పలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అందులో ఆ విదేశీయుడి కాలుని తాడుతో కట్టేసి గ్రామస్థులు, సాయుధ బలగాలు తీసుకెళ్తుండటం ప్రారంభించారు. డాక్యుమెంట్లు లేకుండా దారిలో నేపాల్‌లోకి జారుకోవడానికి ట్రై చేస్తుండగా జవాన్లు అతన్ని పట్టుకున్నారు.
పోలీసుల విచారణలో ఆ వ్యక్తి తన పేరు జోర్డాన్ బ్రౌన్ అని, తన వయసు 36 ఏళ్లని చెప్పాడు. తాను అమెరికాలోని కాలిఫోర్నియా నివాసిని, గతంలో ఆరు సంవత్సరాల పాటు యూఎస్ నేతలో పనిచేశానని చెప్పి షాక్ ఇచ్చాడు. అయితే తన మాటలను నిరూపించడానికి అతని దగ్గర ఎలాంటి ఐడీ కార్డులు లేవు. బోర్డర్ పిల్లర్ నంబర్ 516 దగ్గర తనిఖీలు చేస్తుండగా జవాన్లను చూసి పారిపోవడానికి చూసిన ఇతన్ని వెంటాడి మరీ పట్టుకున్నారు. అతని దగ్గర 31,460 రూపాయల క్యాష్ తో పాటు రెండు మొబైల్ ఫోన్లు దొరికాయి.
బ్రౌన్ చెప్పిన ట్రావెల్ హిస్టరీ వింటే ఇంటెలిజెన్స్ అధికారులకే మైండ్ బ్లాక్ అవుతోంది. టూరిస్ట్ వీసాతో థాయ్‌లాండ్ వెళ్లిన ఇతను అక్కడ పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నాడట. ఆ తర్వాత సముద్ర మార్గంలో శ్రీలంక వెళ్లి, అక్కడి నుంచి 2025 నవంబర్ 2న ఇండియాలో దొంగచాటుగా అడుగుపెట్టాడు. అంటే దాదాపు ఎనిమిది నెలలుగా పోర్ట్ లేకుండానే గోవా బెంగళూరు నగరాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఉంటుంది. ఇప్పుడు యూపీ మీదుగా నేపాల్ వెళ్లాలనే ప్లాన్ తో వచ్చి దొరికిపోయాడు. సోనౌలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఈ అరెస్టుతో దేశ భద్రతా సంస్థల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఎందుకంటే గత మార్చి నెలలో కూడా మ్యాథ్యూ ఆరోన్ వాన్ డైక్ అనే మరో అమెరికా సిటిజన్ ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. అతనితో పాటు ఆరుగురు ఉక్రెయిన్ పౌరులు కూడా మయన్మార్ బోర్డర్ ద్వారా మిజోరంలోకి అక్రమంగా చొరబడ్డారు. వీరంతా భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగడానికి పెద్ద కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
ఆ పాత గ్యాలకు నిషేధిత ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉండటమే కాకుండా వారికి ఆయుధాలు సరఫరా చేయడం, డ్రోన్లను అందించడం లాంటి పనులు తేలింది. వారిపై ఇప్పటికే ఉపా చట్టం కింద కేసులు పెట్టారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఓ యూఎస్ నేవీ మాజీ సైనికుడు ఇండియాలో నెలల తరబడి తిరగడం వెనుక ఏదైనా అంతర్జాతీయ నెట్వర్క్ ఉందా అనే కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి.

