హైదరాబాద్: ఎల్ నినో ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాళేశ్వరం కూలడానికి బిఆర్ఎస్సే కారణమని విమర్శలు గుప్పించారు. ఎన్ డిఎస్ఎ తుది నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని, నిపుణులు చెబితే వెంటనే ప్రాజెక్టుల్లో నీళ్లు నింపుతామని, కరువును దృష్టిలో ఉంచుకుని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. మేడిగడ్డ, కన్నెపల్లిపై బిఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్ డిఎస్ఎ తుది నివేదిక తెప్పించాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, హరీష్ రావు బాధ్యతాయుతమైన సూచనలు చేయాలని చురకలంటించారు. రక్తం ప్యాకెట్లతో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షం బాధ్యతగా సలహా, సూచనలు అందించిన పొన్నం సూచించారు.

