టిప్పర్, ట్రాక్టర్, జేసీబీ సీజ్.. కేసు నమోదు
విశాలాంధ్ర – శింగనమల: మండల పరిధిలోని చీలేపల్లి, ఉల్లికల్లు తదితర ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్, ట్రాక్టర్, జేసీబీని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.సీజ్ చేసిన ట్రాక్టర్, జేసీబీ తెలుగుదేశం పార్టీ నాయకుడు కన్వీనర్ మారుతీనాయుడుకు సంబంధించినవని, టిప్పర్ టీడీపీ నాయకుడు ఉల్లికల్లు రంగారెడ్డికి సంబంధించిన ఎస్ఐ ప్రసాద్ అలకరించారు. జూలకాల్వ, జలాల్పురం, పెరవలి తదితర వాగులు, వంకల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ తెలిపింది.మండలంలో అక్రమ ఇసుక రవాణాపై వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ప్రసాద్ స్పష్టం చేశారు.

