- ఇరాన్‌కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్
- ఈసారి దాడి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక
- టెహ్రాన్ నాయకత్వానికి నేరుగా హెచ్చరికలు
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్తులో ఇరాన్ మరోసారి దాడికి పాల్పడితే గతంలో కంటే చాలా రెట్లు తీవ్రంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని తెలియజేసేందుకు టెహ్రాన్ నాయకత్వానికి నేరుగా హెచ్చరికలు చేశారు.
దక్షిణ ఇజ్రాయెల్‌లోని డిమోనా నగరంలో జరిగిన నెగెవ్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన నెతన్యాహు.. ”ఇరాన్ నాయకులకు నేను ఒకటే చెబుతున్నా.. మాపై దాడి చేస్తే ఇజ్రాయెల్ మౌనంగా ఉంటుందని అనుకోవద్దు. గతంలో జరిగినట్లే ఈసారి కూడా ఉంటుందని అసలు ఊహించకండి. ఈసారి మా ప్రతిస్పందన మరింత శక్తివంతంగా ఉంటుంది.” అని హెచ్చరిక. ఇరాన్ లేదా దానికి మద్దతుగా పనిచేస్తున్న సంస్థలు ఇజ్రాయెల్‌పై దాడి చేస్తే ఇకపై ఎటువంటి ఉపేక్షించబోమని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా మాపై దాడి చేస్తే మేము గట్టిగా ప్రతీకారం తీర్చుకోకుండా ఊరుకునే రోజులు ముగిశాయని.. ఇరాన్ నుండి అక్ష దుష్ట శక్తులు నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా ఇజ్రాయెల్ బలంగా ప్రతిస్పందిస్తుందని పేర్కొన్నారు. అయితే ఇరాన్ మరోసారి దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటామనే విషయాన్ని వెల్లడించలేదు.
ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నేరుగా క్షిపణి దాడుల తర్వాత పరిస్థితి కొంత ప్రశాంతంగా మారడంతో.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మాత్రం కొనసాగుతోంది. ప్రాంతీయ యుద్ధం మరింత విస్తరించకుండా దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు చేసుకుంటూనే ఉన్నాయి. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతున్నాయి.. లెబనాన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా సహా పలు మిలిటెంట్ సంస్థల నుంచి వచ్చే ముప్పుపై కూడా ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉంది.
ఈ సందర్భంగా హిజ్బుల్లాపై కూడా నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత హిజ్బుల్లా సైనిక సామర్థ్యం దెబ్బతిన్నదని తెలియజేసింది. యుద్ధానికి ముందు ఉన్న క్షిపణి నిల్వల్లో ప్రస్తుతం కేవలం 7 నుంచి 8 శాతం మాత్రమే హిజ్బుల్లా దగ్గర మిగిలి ఉంది. అయితే ఈ వ్యాఖ్యలపై హిజ్బుల్లా ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. గాజా సరిహద్దు ప్రాంతాల పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని నెతన్యాహు తెలియజేసారు. పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, యుద్ధానికి ముందు ఇప్పుడు ఆ జనాభా మరింత పెరిగిందని చెప్పారు.

