ఆంధ్ర ప్రదేశ్ : కాపు ఉద్యమ నేతముద్రగడ పద్మనాభం మరణించారు.
ఆంధ్రప్రదేశ్: కాపు ఉద్యమ నేతముద్రగడ పద్మనాభం మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. హైదరాబాద్ లోని సింధూ ఆసుపత్రిలో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. ఆయన శ్వాస కోశ వ్యాధులతో బాధపడుతున్నారు. 1978 తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో అనేక పదవులు పొందారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా…
ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ముద్రగడ పద్మనాభం ఎన్నికయ్యారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం పేరు తెచ్చుకున్నారు. కాపు సామాజికవర్గం సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. ఉద్యమాలు జరిగాయి. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభం అధికారంలో ఉన్నా, లేకపోయినా కార్యకర్తలు వస్తారు. ముద్రగడ పద్మనాభం మృతిపట్ల రాజకీయ నేతలు సంతాపాన్ని ప్రకటించారు.
వార్తల సారాంశం – కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు

