తెలంగాణ:హైదరాబాద్ నగరంలో మరోసారి ఏసీబీ సోదాల కలకలం రేగింది.హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ ( బచ్చు రవీందర్ )ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు.
ఈరోజు(మంగళవారం) ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.బచ్చు రవీందర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయిన నేపథ్యంలో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి.
అక్రమంగా ఆస్తులను కూడబెట్టినట్టు చీఫ్ ఇంజినీర్‌పై ఆరోపణలు ఉన్నాయి.దీంతో ఏకకాలంలో 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలకు దిగారు.
ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ ( ACB DSP Majid Ali Khan ) ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి.ఇప్పటికే రవీందర్ నివాసంలో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు.
పత్రాలతోపాటు, వివిధ ప్రాంతాల ఇళ్లను అధికారులు గుర్తించారు.రవీందర్ నివాసంలో బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు సమాచారం.
ఈరోజు సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది.


