మెల్బోర్న్: ఐపిఎల్ తర్వాత ప్రపంచ క్రికెట్లో రెండో అతి పెద్ద టి20 క్రికెట్ లీగ్‌గా పేరు తెచ్చుకున్న ఆస్ట్రేలియా బిగ్‌బాష్ సీజన్ 202627 షెడ్యూల్‌ను మంగళవారం క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా భారత గడ్డపై ఓ విదేశీ క్రికెట్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. బిసిసిఐ, క్రికెట్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా బిగ్‌బాష్ ఆరంభ మ్యాచ్‌ను భారత్‌లో నిర్వహిస్తుంది. డిసెంబర్ 12న చెన్నైలోని ఎంఈ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఇక తాజాగా ఆస్ట్రేలియా దీన్ని అధికారికంగా ధ్రువీకరించింది. డిసెంబర్ 12న ప్రారంభమయ్యే బిగ్‌బాష్ టోర్నీ జనవరి 26న జరిగే ఫైనల్‌తో ముగుస్తోంది.

