తెలంగాణ:ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ ప్రవేశ జిల్లా ఎస్పీ నితికా పంత్ (ఎస్పీ నితికా పంత్ )ఐపీఎస్ అధ్యక్షతన నెలవారీ నేర సమీక్ష మంగళవారం జరిగింది.ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని,బాధితులకు న్యాయం చేయాలని, కేసుల విచారణలో జాప్యం చేయరాదని ఎస్పీ సూచించారు.
పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిరంతర గస్తీ, డయల్ 100 కాల్స్‌కు వేగంగా స్పందించాలని, కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, సీసీటీఎన్ఎస్లో నేరస్థుల వివరాల నిర్వహణను పరిశీలించాలని సూచించారు.

