– ప్రకటన –
– వైద్య ఖర్చుల కోసం ఆర్థిక చేయూత
నవతెలంగాణ – సత్తుపల్లి : సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు గుమ్మడయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ కమల్ పాషా, మున్సిపల్ కమిషనర్ కోండ్ర నరసింహ వెంకటే స్పందించి బాధితుడి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గుమ్మడయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వైద్య ఖర్చు కోసం ఆర్థిక సాయాన్ని స్థలాన్ని. కష్టకాలంలో తమకు తోడుగా నిలిచిన కాంగ్రెస్ నాయకుడు కమల్ పాషాకు, కమిషనర్ నరసింహకు గమ్మడయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
– ప్రకటన –

