త్వరలో రాష్ట్రంలో ‘మినీ మార్ట్’ల ఏర్పాటు
పేదల బియ్యం దుకాణాల్లో ప్రైవేట్ వ్యాపారాలు
పక్కా ప్రణాళికతో ప్రైవేట్ సంస్థకు అప్పగింత
విశాలాంధ్ర`సచివాలయం : రాష్ట్రంలో పేదల ఆకలి తీరుస్తూ దశాబ్దాలుగా సాగుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తూ, చౌక ధరల ఉత్పత్తులను ఇంధన శక్తుల లాభార¨న కేంద్రాలుగా మార్చేందుకు పౌస్ Áసరఫరాల శాఖ అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. రేషన్ మార్ట్లను ఆధునిక ‘మినీలు’ గా నిరంతరాయంగా నడిచే ‘కమ్యూనిటీ రిటైల్ కేంద్రాలు’ గా తీర్చిదిద్ది డీలర్ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తా మంటూ ప్రభుత్వం చెబుతున్న రంగుల మాటల వెనుక నిరుపేద డీలర్లను అప్పలను ఊబిలోకి నెట్టే పక్కా వ్యూహం దాగి ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్డుదారులకు సకల సరుకులు భవిష్యత్‌లో బియ్యం, ఇతర నిత్యావసరాల సరఫరా బాధ్యత నుంచి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసి, ఈ మొత్తం ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకే ఈ ‘మినీ మార్ట్’ నాటకానికి తెరతీశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు ఆధారంగా ఉన్న చౌక ధరలను ఒక్కసారిగా కమర్షియల్ మాల్స్‌గా మార్చడం చూడటం క్షేత్రస్థాయి వాస్తవాలకు విరుద్ధమని, ఇది డీలర్ల పాలిట యమపాశంగా మారబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 29,794 రేషన్ షాపులు ఉండగా, అందులో కనీసం 200 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న షాపులనే మినీ మార్ట్లుగా మారుస్తామని పౌరసరఫరాల శాఖ సరికొత్త మెలిక పెట్టింది. ఈ నిబంధనల ప్రకారం రాష్ట్రం మొత్తం మీద వెతికినా తొలి దశలో గుంటూరు (125), ఎన్టీఆర్ (93), ఏలూరు (163), (152) జిల్లాల్లో కలిపి కేవలం 533 షాపులను మాత్రమే అధికారులు గుర్తించారు. అంటే, దాదాపు 98 వంతున మిగిలిన 29 వేలకు పైగా రేషన్ దుకాణాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలు ఇరుకు సందుల్లో, చిన్న చిన్న అద్దె గదుల్లో నడుస్తున్నందున ఈ ప్రాజెక్టుకు పూర్తిగా అనర½మైనవని స్పష్టమవుతోంది. స్థలభావ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న ఈ వేలాది మంది చిన్న డీలర్ల పరిస్థితి ఏమిటనే దానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాధానం లేదు. భవిష్యత్‌లో ఈ స్థలం నిబంధనను అడ్డం పెట్టుకుని వేలాది మంది పేద డీలర్ల లైసెన్సులను రద్దు చేసి, ఆ దుస్తులను కూడా పెద్ద బ్రాండ్ మాల్స్‌కు మార్చేందుకే ఈ వ్యూహం పన్నారనే అనుమానాలు రేషన్ డీలర్ల సంఘాల్లో గుబులు రేపుతున్నాయి. ఈ మినీ మార్ట్‌లకు నిత్యావసర సరుకులను సరఫరా చేసే బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థలకు కాకుండా ఏరికోరి ‘ఫ్రాంటియర్ మార్కెట్స్’ అనే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం వెనుక ఆరోపణలు జోరుగా సాగుతున్నాయి. వ్యాపార నమూనా, అమలు పరిశీలించామని అధికారులు పైకి చెబుతున్నప్పటికీ అధికారిక సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లేని ప్రైవేట్ వస్తువులను రేషన్ దుకాణాల్లో ఉంచడం ద్వారా వాటి ధరలపై నియంత్రణ ఎవరిదనే ప్రశ్న తలెత్తుతోంది. పేద కార్డుదారులు రేషన్ బియ్యం కోసం వస్తే వారిపై బలవంతంగా ఈ ప్రైవేట్ కంపెనీ సరుకులను రుద్దే ప్రమాదం స్పష్టంగా నిర్ణయించబడింది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి రావాల్సిన కమీషన్లు సకాలంలో అందక, షాపుల అద్దెలు, కరెంట్ బిల్లులు కట్టలేక రేషన్ డీలర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే… ఇప్పుడు మినీ మార్ట్ల పేరుతో కొత్త సరుకులు కొనుగోలు చేసి పెట్టుబడులు పెట్టడంతో పౌరసరఫరాల శాఖ ఒత్తిడి తేవడంతో వారిని అప్పలపాలు చేయడమేనని డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ప్రైవేట్ కంపెనీ సరుకులు అమ్ముడుపోకపోతే ఆ నష్టాన్ని డీలర్లే భరించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం… గుంటూరు జిల్లాలో గుర్తించిన కేవలం 10 రేషన్ షాపుల్లో ఈ నెల నుంచే ఈ మినీ మార్ట్ల పైలట్ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అసలు ఈ 10 దుకాణాల్లో వ్యాపారం ఎలా సాగుతుంది, డీలర్లు ఎంత అప్పుల పాలవుతారు, కార్డుదారుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందనే కనీస ప్రాథమిక అంచనాలు, క్షేత్రస్థాయి అధ్యయనం చేయలేదు. గుంటూరులో పైలట్ ప్రాజెక్టు వెంటనే విజయవంతమైతే ఆ రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులకూ విస్తరిస్తాం’ అని అధికారులు ప్రకటించడం వారి తొందరపాటుతనానికి, బోర్డు సంస్థలకు లాభాలు చేకూర్చేందుకు ఆరాటంగా నిలుస్తోంది. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, పేదలకు అందే ఉచిత రేషన్ వ్యవస్థ పూర్తిగా నాశనమవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రేషన్ డీలర్లు రోడ్డున పడడం తప్ప మరో మార్గం లేదని డీలర్ల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
పోస్ట్ రేషన్ వ్యవస్థకు’కార్పొరేట్’ గ్రహణం! మొదట కనిపించింది విశాలాంధ్ర.

