జెమినీ టీ… ఈ బ్రాండ్ తెలియని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టీ అంటే జెమినీ టీనే అని ఫీల్ అయ్యేవారు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడంటే రకరకాల బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి కానీ.. ఒకప్పుడు మార్కెట్లో ఉన్న కొద్ది బ్రాండ్లలో జెమినీ టీ సేల్స్ టాప్ లో ఉండేవి. ఈ బ్రాండ్ కి ఫ్యాన్స్ ఇప్పటికీ ఉన్నారు.. అలాంటోళ్లకు గుండె పగిలిపోయే వార్త ఇది. జెమిని టీ పొడిని కూడా కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. మంచిర్యాల జిల్లాలో ఈ కల్తీ బాగోతం బయటపడింది.
మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్లోని మహేశ్వర ట్రేడర్స్ నుంచి గోలేటి కీ అక్రమంగా తరలిస్తున్న నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పోలీసులు పట్టుకున్నారు. టోల్ గేట్ దగ్గర తనిఖీలు నిర్వహించగా… నకిలీ టీ పొడి పట్టుబడింది.. నకిలీ జెమిని రెండు బాక్స్‌లను ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించిన పోలీసులు..
►ఇంకా చదవండి | దేశంలో నమోదైన సైబర్ కేసుల్లో… 44 శాతం తెలంగాణలోనే: డీజీపీ సీవీ ఆనంద్
నకిలీ చాయ్ పత్తి నీ సీజ్ చేసి షాపు యాజమానికీ నోటీసులు జారీ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఈరోజుల్లో ఏది నకిలీ.. ఏది అసలు కనిపెట్టడం కష్టమైపోతోందని.. ఫుడ్ ఎఫ్టీ అధికారులు కఠిన చర్యలు చేపట్టి నకిలీ మార్కెట్‌ను అరికట్టాలని కోరుతున్నారు.

