- ఫెడరల్ రిజర్వ్ బ్యాలెన్స్ షీట్లను సమీక్షించనున్న మాజీ ఆర్బీఐ గవర్నర్
- రాజ్ చెట్టి, ఆశా శర్మలకు కూడా చోటు దక్కింది
- వీరి రిపోర్ట్‌ల ఆధారంగానే వడ్డీ రేట్ల మార్పుపై నిర్ణయం
న్యూయార్క్: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తన మానిటరీ పాలసీని సమీక్షించడానికి భారత సంతతికి చెందిన ఆర్థికవేత్తలను నియమించింది. మొత్తం ఐదు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయగా, ఆర్బీఐఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థికవేత్త రాజ్ చెట్టి, మైక్రోసాఫ్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆశా శర్మలకు అవకాశం కల్పించారు. ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్మన్ కెవిన్ వార్ష్ ఈ సమీక్షా కమిటీలను పరిశీలించారు. ఈ ప్యానెల్స్‌లో నోబెల్ గ్రహీత థామస్ సార్జెంట్, బ్యాంక్ ఆఫ్ బ్రిటిష్ మాజీ గవర్నర్ మెర్విన్ కింగ్, వాల్‌మార్ట్ మాజీ సీఈఓ డగ్ మెక్ మిలన్, సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. మారుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా ఫెడ్ విధానాలు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీలు తమ రిపోర్ట్‌లను అందిస్తాయి.
మనవాళ్లకు కేటాయించిన కీలక విభాగాలు:
టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడిగా రాజన్ సేవలు
1. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ‘బ్యాలెన్స్ షీట్ పాలసీ’ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడిగా సేవలందించనున్నారు. హార్వర్డ్ ఆర్థికవేత్త కరెన్ దినాన్, మాజీ ఫెడ్ గవర్నర్ జెరెమీ స్టెయిన్‌లతో కలిసి ఆయన ఈ ప్యానెల్లో పనిచేస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ అసెట్ హోల్డింగ్స్, మానిటరీ పాలసీలో వాటి పాత్ర, బ్యాలెన్స్ షీట్ నిర్వహణ వల్ల కలిగే లాభనష్టాలను ఈ కమిటీ పరిశీలించనుంది.
2. డేటా టాస్క్‌ఫోర్స్‌కు రాజ్ చెట్టి నాయకత్వం
యూఎస్‌లో ఆర్థిక అసమానతలు, లేబర్ మార్కెట్‌ను అంచనా వేయడానికి రియల్ టైమ్ డేటాను ఉపయోగించడంలో రాజ్ చెట్టుకి అనుభవం ఉంది. ‘డేటా’ టాస్క్‌ఫోర్స్‌కు కో–లీడర్‌గా, డగ్ మెక్‌మిలన్, కెవిన్ మర్ఫీలతో కలిసి ఆయన పనిచేస్తున్నారు. ఫెడ్ తీసుకునే నిర్ణయాల కోసం రియల్ టైమ్ డేటా క్వాలిటీని చెక్ చేస్తారు.
3. ఉద్యోగాలపై ఆశ శర్మ దృష్టి
మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఎక్స్‌బాక్స్ సీఈఓ అయిన ఆశా శర్మ.. ‘ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయిమెంట్’ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యురాలిగా నియమితులయ్యారు. మార్క్ ఆండ్రీసెన్, చార్లెస్ ఐ. జోన్స్‌లతో కూడిన ఈ ప్యానెల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్ ఇండస్ట్రీలు ప్రొడక్షన్‌పై , ఉద్యోగాలపై, ఆర్థిక వృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అంచనా వేస్తుంది. కాగా, ఈ ఇండిపెండెంట్ టాస్క్‌ఫోర్స్‌లు అందించే రిపోర్ట్‌ల ఆధారంగా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌వో) వడ్డీ రేట్లను మార్చడంపై నిర్ణయం తీసుకుంటుంది.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“సెట్”, “టైటిల్”, “అమెరికా ఫెడ్లో రఘురామ్..రాజ్ చెట్టి, ఆశా శర్మలకు కూడా చోటు”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

