చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. అలాంటి గొప్ప నటుడు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా ఉన్నాడు. బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సంవత్సరం ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన దసరాకి విశ్వంభర సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఆగస్టు 22వ తేదీన అతని బర్త్ డే సందర్భంగా అదే రోజు బాబీ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను అలాగే గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…ఇక ప్రస్తుతం తన సినిమాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.
బాబి తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్ అయిన చిరంజీవి ఆ సినిమా ఉంటుందా అనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. ఒకవేళ శ్రీకాంత్ ఓదెల ను పక్కన పెడితే డైరెక్టర్ మోహన్ రాజు దర్శకత్వంలో ఒక డిఫరెంట్ సబ్జెక్టు తో సినిమా చేయబోతుండనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇది రీమేక్ సినిమానా లేదంటే స్ట్రైయిట్ కథ తోనే రాబోతుందా అనేది తెలియాల్సి ఉంది.
ఇక వీళ్ళతో పాటుగా ‘జైలర్’ సినిమాతో స్టార్ట్ డం ని అందుకున్న నెల్సన్ డైరెక్షన్ లో కూడా చిరంజీవి ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట. రీసెంట్ గా నెల్సన్ చిరంజీవిని ఒక కథను కూడా వినిపించినట్లుగా తెలుస్తుంది. అయితే ‘జైలర్ 2’ సినిమా సక్సెస్ ని సాధిస్తే నెల్సన్ సినిమానే మొదటి స్టార్ట్ చేసే అవకాశాలున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి…
ఇక ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్న వాళ్ళ వెనకాలే హీరోలు గాని, ప్రొడ్యూసర్స్ అయినా పడతారు. అందుకే నెల్సన్ ‘జైలర్ 2’ సినిమాతో ఎలాంటి విజయాన్ని సాధిస్తాడు అనే దాని మీదనే అతను చిరంజీవితో సినిమా చేయబోతున్నాడా? లేదా అనేది ఫిక్స్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది…

