Shivam Dube: శివం దూబే గురించి చర్చకు వచ్చినప్పుడు.. చాలామంది మాట్లాడుకునే మాట.. అతడు సిక్సర్ల దూబే అని.. కానీ అతడు విఫలమవుతున్నాడు. సిక్సర్ల నుంచి.. సున్నా లేదా ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అవుతున్నాడు. జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నతంగా ఆడాల్సిన అతడు.. మరింత దారుణంగా ఆడుతున్నాడు. అసలు అతడికి చోటు ఎందుకు ఇచ్చారు.. మిగిలిన ఆటగాళ్లు లేరా.. అతడి కంటే ఆటగాళ్లు జట్టులో కనిపించడం లేదా.. అనే ప్రశ్నలు అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్లో దూబేగా ఆకట్టుకోలేదు. మిగిలిన అన్నిట్లో అతను విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్లలో అతడు వరుసగా 42, 5, 2, 22, 14 పరుగులు చేశాడు. ఒకవేళ అతడు గట్టిగా నిలబడి ఉంటే.. కచ్చితంగా టి20 సిరీస్ కోల్పోయి ఉండేది కాదు. కానీ అతడు వచ్చిన వినియోగించుకోలేకపోయాడు. మేనేజ్మెంట్ నమ్మకాన్ని కాపాడుకోలేకపోయాడు.
ఇప్పుడు జరుగుతున్న వీడియో సిరీస్లో కూడా అతడు దారుణమైన ఆట తీరు కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా రెండవ మ్యాచ్లో వరుసగా వికెట్లు కోల్పోయినప్పుడు. నిలబడి పరుగులు చేయాల్సి ఉండగా.. కేవలం 0 పరుగులకు అవుట్ అయ్యాడు. కనీసం బంతిని గట్టిగా ఎదుర్కోలేకపోయాడు. వికెట్లు పడుతున్న విషయం తెలిసినప్పటికీ. క్యాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు అంటే.. బ్యాటింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి నిర్లక్ష్యమైన ఆట తీరు కొనసాగిస్తున్న అతని జట్టు నుంచి తొలగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
”అతన్ని ఎందుకు జట్టులోకి తీసుకుంటున్నారు.. అతడి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా.. ఒక మనిషికి ఆరవ వేలు గనుక ఉంటే.. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. దూబే కూడా అలానే మారిపోయాడు. మరి ఇతడి విషయంలో మేనేజ్మెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. గౌతమ్ గంబీర్ ఇన్నాళ్లపాటు సపోర్ట్ చేశాడని, ఇకపై అతడు కూడా సపోర్ట్ చేసే అవకాశం లేదని సమాచారం.

