చాలా మంది భవిష్యత్ కోసం పొదుపు చేస్తారు. ఇల్లు కొనుగోలు చేయడానికి లేదా పిల్లల చదువుకు లేదా రిటైర్మెంట్ కోసం డబ్బులు పొదుపు చేస్తారు. పొదుపు చేస్తున్న డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టామని నిపుణులు చెబుతున్నారు. మీరు మీ లక్ష్యాన్ని బట్టి పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలని చెబుతున్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలు అయితే మీరు మీ పొదుపులో కొంత మ్యూచువల్ ఫలో పెట్టుబడి పెట్టడం బెటరని సూచిస్తున్నారు. పలు రకాల మ్యూచువల్ ఫండ్లు దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇచ్చాయి.
అయితే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నదని గుర్తుంచుకోవాలి. అయితే గత 20 ఏళ్లలో దాదాపు ఏడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు మంచి రాబడులను ఇచ్చాయి. 20 ఏళ్లలో పెట్టుబడిని 22 రెట్లు చేశాయి. ఇందులో లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్,ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ గత 20 ఏళ్లలో 16.8 శాతం రాబడి ఇచ్చింది. ఇది పెట్టుబడిదారుల డబ్బును 22.4 రెట్లకు పెంచింది. హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గత 20 ఏళ్లలో 15.4 శాతం రాబడి ఇచ్చింది. పెట్టుబడిదారుల డబ్బును 17.6 రెట్లు పెంచింది.
అలాగే ఫ్రాంక్లిన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ 20 సంవత్సరాలలో పెట్టుబడిదారుల డబ్బును 16.9 రెట్లు పెంచింది. ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గత 20 ఏళ్లలో పెట్టుబడిదారుల డబ్బును 15.8 రెట్లకు పెంచింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 20 సంవత్సరాల్లో 14.43 రాబడి ఇచ్చింది. పెట్టుబడిదారుల డబ్బును 14.4 రెట్లకు పెంచింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లార్జ్ క్యాప్ ఫండ్ గత 20 ఏళ్లలో పెట్టుబడిదారుల డబ్బును 13.5 రెట్లకు పెంచింది. ఈ ఫండ్ 13.9 శాతం రాబడిని అందించింది.
హెచ్డీఎఫ్సీ లార్జ్ క్యాప్ ఫండ్ గత 20 ఏళ్లలో 13.7 శాతం రాబడి ఇచ్చింది. పెట్టుబడిదారుల డబ్బును 13 రెట్లు చేసింది. ఈ ఏడు ఫండ్లు గత 15 ఏళ్లలో పెట్టుబడిదారుల సంపదను 10 రెట్ల వరకు పెంచాయి. మ్యూచువల్ ఫండ్లలో స్మాల్ క్యాప్ ఫండ్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు వైవిధ్యంగా ఉండాలని చెబుతున్నారు. మీ సొమ్మును ఒకే ఫండ్‌లో కాకుండా డైవర్సిఫై చేయాలని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సైట్లు మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కానీ, ఆమోదించడం కానీ బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించడం. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

