వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఆయన పార్టీ నేతలు గానీ, అభిమానులు గానీ… ఓ రేంజిలో ఎలివేషన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ఏ ఒక్క పార్టీతో పొత్తు అన్నే ఒంటరిగా పోటీకి దిగుతారని… సింహం సింగిల్ గా వస్తుందంటూ వారు చెబుతూ ఉంటారు. అదే సమయంలో ఎవరైనా జగన్ అడుగుజాడల్లో నడవాల్సిందే గానీ… ఆయన ఏ ఒక్కరిని అనుకరించరని కూడా చెబుతూ ఉంటారు. ఒంటరి పోరు వరకైతే ఓకే గానీ… అనుకరణ విషయంలో మాత్రం తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారని చెప్పక తప్పదు. తమిళనాట సంచలన విజయం నమోదు చేసి ఫస్ట్ అటెంప్ట్ లోనే సీఎం కుర్చీ అందుకున్న టీవీకే అదినేత, తమిళ సీఎం జోసెఫ్ విజయ్ అడుగుజాడల్లోకి జగన్ దిగిపోయారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే తమిళ వెట్రిగ కజగం (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని పెట్టిన విజయ్… ఇటీవల ముగిసిన ఎన్నికలకు పకడ్బందీ ప్లాన్ తో సాగారు. తన రాజకీయ వ్యూహాలు కపిల్ సాహు, జాన్ ఆరోక్యసామిల సేవలను వినియోగించుకున్నారు. ఇక తన పార్టీలో క్షేత్రస్థాయి కార్యకర్తతో నేరుగా సంబంధం కొనసాగించేందుకు నా టీవీకే పేరుతో ఓ యాప్‌నూ రూపొందించారు. రచనల రచనలో ఆరితేరిన కపిల్, జాన్ ల సలహాలు, మై టీవీకే యాప్ ను సమర్థవంతంగా నిర్వహించిన విజయ్… ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో ఘన విజయం సాధించారు.
కట్ చేస్తే… ఇప్పుడు ఏపీలోనూ 2029 సార్వత్రిక ఎన్నికలకు విపక్ష వైసీపీ కూడా అచ్చు గుడ్డినట్లు టీవీకే మాదిరిగానే అడుగులు వేస్తోంది. టీవీకేకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన కపిల్ సాహును వైసీపీ తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకునే దిశగా అడుగులు వేస్తోందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా కపిల్ తో జగన్ అండ్ కో చర్చలు జరిపామని, ఈ చర్చల్లో ప్రోడక్ట్ కూడా ఉందని, త్వరలోనే ఈ విషయంపై జగనే అధికారికంగా ఓ ప్రకటన చేయనున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 2019లో ప్రశాంత్ కిశోర్ సేవతో గెలిచిన జగన్… ఈ దఫా కపిల్ సేవతో గట్టెక్కాలని చూస్తున్నట్లు సమాచారం.
ఇక జగన్ 2.0 యాప్ పేరుతో జగన్ ఓ యాప్ ను గురువారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ యాప్ అచ్చుగుద్దినట్లుగా మై టీవీకే యాప్ ను పోలి ఉందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి, మై టీవీకే యాప్ ద్వారా కింది స్థాయి కార్యకర్తలతోనూ విజయ్ ఏ రీతిన బంధం నెరిపారో… సూపర్ యాప్ ద్వారా జగన్ కూడా కింది స్థాయి కేడర్ తో తన బంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా అటు రాజకీయ వ్యూహ రచనలో అయినా, ఇటు యాప్ ఆవిష్కరణలో అయినా జగన్ అచ్చుగుద్దినట్లుగా విజయ్ ను గుడ్డిగా ఫాలో అయిపోతున్నారన్న వాదనలు అయితే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మరి విజయ్ ఫార్ములాను కాపీ కొట్టేస్తున్న జగన్… 2029 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని సాధిస్తారో చూడాల్సి ఉంది.

