ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణము, గ్రామీణ ప్రాంతాలలో గల ప్రభుత్వ, మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా సాయంత్రం నాలుగు గంటల నుండి 5 గంటల వరకు అదనపు తరగతులను నిర్వహించాలని ఎంఈఓలు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్కేషన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రకారం ఈ తరగతులు నిర్వహించాలని తెలిపారు. ఈ తరగతులు జులై 13వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు కేటాయించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం జరగాలని తెలిపారు. ఈస్టర్ అదనపు తరగతులు నిర్వహించుటలో హెడ్మాస్టర్లు కీలకపాత్ర వహించాలి. ఎక్కడా ఎటువంటి ఫిర్యాదులు అందకుండా తల్లిదండ్రుల సహకారంతో విజయవంతం అయ్యేలా చూడాలని అన్నారు.2026-27 సంవత్సరంలో ప్రతి పాఠశాలలో ప్రతి పాఠశాలలో నూరు శాతం ఫలితాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కూడా కృషి చేశారు. ఇంకా పదవ తరగతి విద్యార్థులలో మూడు గ్రూపులుగా విడదీసి, ఉత్తమ విద్యను అందించడానికి కృషి చేసింది. డల్లర్స్ విద్యార్థుల విషయంలో మరింత కృషి చేయాలని వారు గుర్తు చేశారు. కావున హెడ్మాస్టర్లు ఈ అదనపు తరగతులపై తప్పనిసరిగా పర్యవేక్షణ ఉండాలి. జిల్లా కలెక్టర్ గానీ, డీఈఓ గానీ, ఇతర అధికారులు గానీ ఆకస్మిక తనిఖీలు ఉంటాయని తెలిపారు. కావున తల్లిదండ్రులు మీ పిల్లలను ప్రోత్సహించే విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు.

