అహ్మదాబాద్: గుజరాలోని అహ్మదాబాద్లో ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. నగర శివారులోని రామోల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. వీరి పలువురి విషమంగా కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఫ్యాక్టీర లైసెన్సు రద్దు చేసినప్పటికీ.. అక్కడ అక్రమంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని.. ఈ కారణంగానే ఓ యూనిట్లో పేలుడు సంభవించినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

