హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ఇటీవల ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకుని డిశ్చార్జి అయి వచ్చి హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు.
పరామర్శకు వచ్చి…
పవన్ కళ్యాణ్ నివాసానికి శనివారం వచ్చిన నారా లోకేశ్ `పవనన్న మీరు త్వరగా కోలుకోవాలి` అని ఆకాంక్షించారు.వైద్యుల సూచనలు పాటించాలని, మంచి మేరకు విశ్రాంతి తీసుకోవాలని నారా లోకేశ్ సూచించారు. ఈ సంద ర్భంగా డిప్యూటీ సీఎం భుజానికి అయిన గాయం, తలెత్తిన సమస్యలు, జరిగిన శస్త్ర చికిత్స గురించి నారా లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చించినట్లు సమాచారం.

