మేష రాశి వారికి ఈ వారం ఖర్చులు అధికంగా ఉంటాయి. చేసిన పనిని మళ్లీమళ్లీ చేయవలసి వస్తుంది. సంతానం యొక్క విద్యా విషయాలు బాగా ఉన్నాయి. వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మరియు వ్యాపారస్తులకు నూతన భాగస్వామ్యాలు అనుకూలిస్తాయి. తుని రంగంలో ఉన్నవారికి మంచి స్థాయి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారం కాకుండా మీరు సొంతంగా చేసే వ్యాపారాలు కలుసుకునేలా ఉంటాయి. ఆదాయం బాగున్నప్పటికీ, అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పొదుపుపై దృష్టి పెట్టండి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది శనికి తైలాభిషేకం. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. శని గ్రహ స్తోత్రం చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి వారికి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానానికి సంబంధించిన ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా అవసరం అవుతాయి. వృత్తిపరంగా సానుకూల మార్పులు ఉంటాయి. సహోద్యోగుల మద్దతుతో పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పాత బాకీలు వసూలవడంతో ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. సంబంధమైన విశ్వవిహారాలు సానుకూల పడతాయి. విదేశీ వీ ప్రయత్నాలుసా పాస్పోర్ట్ అనుకూలంగా ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. సంఘ సేవలో పాల్గొంటారు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఒక ఏకాదశి రోజు బ్రాహ్మణుడికి స్వయంపాకం దానంగా ఇవ్వండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసె ఇంకా ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మిధున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. కెరియర్ పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తులు విలువ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ప్రాజెక్టులు లేదా వ్యాపార పనులు అత్యంత అనుకూలమైన సమయం. మీ ఆలోచనలకు మంచి స్పందన లభిస్తుంది. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. అఘోర పాశుపత హోమం చేయించండి. ఆదాయ మార్గాలతో పాటు విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. నేను పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి వారం చాలా బాగుందని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీరు తలపెట్టిన పనులు నిర్మాణంగా పూర్తవుతాయి. పనిభారం పెరిగే అవకాశం ఉంది కాబట్టి సహనంతో మరియు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలను చేరుకోండి. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అనవసరపు ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. శారీరక, మానసిక ఒత్తిడికి లోనవకుండా ధ్యానానికి కొద్దిగా సమయం కేటాయించండి. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారికి పూజ చేయండి. ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. విద్యార్థిని విద్యార్థులకు కాలమనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
సింహం
సింహ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కెరియర్ పరంగా మీరు కోరుకున్న స్థిరత్వం లభిస్తుంది. నూతన గృహం కొనుగోలు చేస్తారు. మీ నాయకత్వ లక్షణాలకు ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. ఆర్థికంగా ధనలాభం తెలియజేస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల సత్సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయి. శనికి తైలాభిషేకం చేయించండి. నాలుగు సోమవారాలు రుద్రాభిషేకం చేయించండి కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్య
కన్యా రాశి వారికి ఈవారం గడిచిన వారం కంటే బాగుంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యంగా విదేశీ సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మీరు ఊహించని మంచి ఉద్యోగం లభిస్తుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి కావడంతో ఎంతో ఉత్సాహంగా ఉంటారు. పై అధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది మరియు భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు రచిస్తారు. నూతన గృహం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి మరియు వాహనం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి కాలమనుకూలంగా ఉంది. పాత స్నేహితులను కలుసుకోవడం ఆనందాన్ని ఇస్తుంది. సంతాన సంబంధమైన విషయాలు బాగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
తుల
తులా రాశి వారికి వారం చాలా వరకు బాగుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగ రంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఆలస్యంగానైనా అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. రుణాలు వసూలు అవుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయడం శ్రేయస్కరం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు, పెద్దల సలహాలు తీసుకోండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. మొగలి పువ్వు కుంకుమ కుబేర కుంకుమతో అమ్మవారిని అష్టోత్తరంతో పూజించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి ఏడు కలిసి వచ్చే రంగు నీవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. భూ సంబంధిత విషయాలు బాగా ఉన్నాయి. రైతులకు కాలం అనుకూలంగా ఉంటుంది. టెక్నికల్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన పరిచయాలు మీ వ్యాపార అభివృద్ధికి తోడ్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. గతంలో ఇతరుల నుండి రాకుండా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. విదేశాలలో స్థిరనివాసం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా మొగిలి పువ్వు కుంకుమతో ఆరావళి కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 5 ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ధనస్సు
ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని చేతి అవకాశాలు వచ్చి చేయి జారిపోయే అవకాశం ఉంటే జాగ్రత్త వహించండి. నూతన గృహప్రవేశం చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ స్కీములకు ఎంపిక అవుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తిలో ఉద్యోగాలు ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. సంతాన సంబంధమైన విజయాలు బాగా ఉన్నాయి. ధన ప్రవాహం బాగుంటుంది మరియు గత పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. దేవదర్శనాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. సినీ కళా రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. శనివారం కానీ మంగళవారం కానీ ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి ఆరు కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మకరం
మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటినుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వారం మంచి సంబంధం కుదురుతుంది. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు, కాబట్టి ఓర్పు మరియు పట్టుదలతో పనులను పూర్తి చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సంఘంలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా కాలం పాటు అవకాశాలు వస్తాయి.. ఖర్చులు పెరగకుండా బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. ఆహార నియమాల విషయంలో జాగ్రత్త వహించండి, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఆరావళి కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ప్రతిరోజు కాలభైరవాష్టకం చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి 5 రంగు నీవీ బ్లూ కలిసి ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు.
కుంభం
కుంభ రాశి వారికి వారం చాలా బాగుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. స్థిరాస్తి వివాదాలలో కొలిక్కి వస్తాయి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ సంబంధిత లీజులు కాంట్రాక్టర్లు లభిస్తాయి. చేస్తున్న వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు మీ మాటతో విబేధిస్తారు. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీ తెలివితేటలతో నలుగురిని ఆకట్టుకుంటారు. రంగంలో ఉన్నవారికి నూతన పదవులు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతిరోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలు పరిష్కారమౌతాయి. మంగళవారం మరియు శుక్రవారం రోజు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 9 కలిసివచ్చే రంగు నీవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మీనం
మీన రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. రాబడి ఎంత ఉంటుందో ఖర్చులు కూడా అంతే ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి చిరు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహించారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు శ్రేయస్కరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన వస్తులాభాలు అందుకుంటారు. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సంతాన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. గృహమున శుభకార్యములు నిర్వహించారు. ఏదైనా ఒక శనివారం శనికి తైలాభిషేకం చేయించండి. శని గ్రహం దగ్గర నలుపు వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

