— జిల్లా ఎస్పీ పి.జగదీష్
విశాలాంధ్ర -అనంతపురం :టౌన్ స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఎస్సై, ఆపై స్థాయి పోలీసు అధికారులతో అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ. జిల్లాలో నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్, అస్తి సంబంధ నేరాలు మరియు ఇతర కేసుల నమోదు, చేధనల గురించి పోలీస్ స్టేషన్ వారీగా పోలీస్ అధికారులతో సమీక్ష జరిపిన ప్రజలతో మమేకమై వారితో స్నేహభావంతో మెలిగినప్పుడే పోలీసులకు సదాభిప్రాయం ఏర్పడింది. కేసుల ఛేదింపునకు మరియు పరిష్కారానికి, నేర నియంత్రణకు సహాయపడే పలు సూచనలు మరియు మెళకువలను అధికారులకు దిశా నిర్దేశాలు చేశారు. సైబర్ నేరాలు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం వారిని అప్రమత్తం చేయడం మన కర్తవ్యం అని గుర్తెరిగి ప్రతి ఒక్కరు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. సైబర్ సురక్ష కార్యక్రమంలో భాగంగా డిజిటల్ వాహనాల ద్వారా అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చేరువు కావాలని సూచించారు
మట్కా, పేకాట, గంజాయి, ఇసుక అక్రమ రవాణా… డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకిలు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయడం వంటి కేసులు కేసులు పెంచడం…తద్వారా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలు, చట్టబద్ధత కోసం చట్టబద్ధత కోసం ఆదేశాలు జారీ చేయడంతో పాటు… ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, మిస్సింగ్, చీటింగ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174. సి ఆర్,పి .సి కేసులు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, డిపిఓ కు సంబంధించి పెండింగ్ రిప్లై ఫైల్స్, పెండింగ్, ఎన్ బి డబ్ల్యూ ఎన్ డి పి ఎస్ కేసులలో దర్యాప్తు, రికవరీల గురించి సర్కిల్ వారిగా పోలీసు అధికారులతో సమీక్షించారు.
జిల్లాలో విధుల్లో మంచి ప్రతిభ చూపిన 161 మంది పోలీసు అధికారులు, ఏపీపీలకు మరియు సిబ్బందిని ఎస్పీ అభినందిస్తూ ప్రశంసా పత్రాలు ప్రకటించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఎం.నాగభూషణం, మహబూబ్ బాషా, డీఎస్పీలు రవిబాబు, ఎ.శ్రీనివాస్, పలువురు సిఐలు, ఎస్సైలు, పరీక్షలు నిర్వహించారు.

