ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పోలీసు కేసు నమోదైంది
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పోలీసు కేసు నమోదైంది. భూ కబ్జా కుట్ర కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. భూమి అసలు యజమాని బతికి ఉండగానే, మరణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించి, దాని ఆధారంగా… తప్పుడు వారసత్వ పత్రాలు రూపొందించారని తెలిపారు.
భూ కబ్జా కుట్ర కేసులో…
ఆ భూమిపై హక్కులు పొందే ప్రయత్నం చేశారనే… అసలు యజమాని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసిన కేసులో… మాజీ స్పీకర్ తమ్మినేని తనయుడు చిరంజీవి నాగ్ ను ఏ5గా, తమ్మినేని సీతారాంను ఏ6గా, భార్య తమ్మినేని వాణిని ఏ7గా పోలీసులు చేర్చారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని, తమ్మినేని కుటుంబంపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు.
వార్తల సారాంశం – తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు

