SAIL రిక్రూట్మెంట్: ప్రభుత్వ రంగ సంస్థలో అప్రెంటిస్‌షిప్ చేయాలనుకునే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) పరిధిలోని రూర్కెలా స్టీల్ ప్లాంట్ 2026-27 సంవత్సరానికి 1,110 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాల్లో ప్రత్యేకత లేకుండా ఎంపిక.. ఎలాంటి రాత పరీక్షనే మెరిట్, వాక్-ఇన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 26, 2026 లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక ఇందులోని ఖాళీల వివరాలు చూస్తే.. మొత్తం 1,110 పోస్టులు భర్తీ చేయనున్నారు. వాటిలో ట్రేడ్ అప్రెంటిస్ – 421 పోస్టులు, డిప్లొమా అప్రెంటిస్ – 414 పోస్టులు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 275 పోస్టులు ఉన్నాయి. ఇక అర్హతల విషయానికి వస్తే.. ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంకా డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు ఇంజినీరింగ్, జీఎన్ఎం, డి.ఫార్మా, రేడియాలజీ సంబంధిత విభాగాల్లో డిప్లొమా పూర్తి చేయాలి. అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు బీఏ, బీఎస్సీ, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ నర్సింగ్ వంటి పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 2022 నుండి 2026 మధ్యకాలంలో సాధారణ విద్యార్థులుగా తమ విద్యార్హతను పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి కనీస వయస్సు 18 సంవత్సరాలు కాగా.. వయస్సు 28 సంవత్సరాలుగా నిర్ణయించారు. వయస్సును ఆగస్టు 31, 2026 నాటికి లెక్కిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల స్టైపెండ్ కూడా ఇస్తారు. ట్రేడ్ అప్రెంటిస్ కు రూ.9,600 నుంచి రూ.10,560 వరకు.. డిప్లొమా అప్రెంటిస్ కు రూ.10,900.. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు రూ.12,300 స్టైపెండ్ అందజేస్తారు.
ఈ ఉద్యోగాల కోసం ఐటీఐ అభ్యర్థులు ముందుగా Apprenticeship India Portalలో నమోదు చేసుకోవాలి. డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులు NATS పోర్టల్‌లో ఎంపిక చేయాలి. ఆ తరువాత “స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రూర్కేలా స్టీల్ ప్లాంట్”ను ఎంపిక చేసి ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 26, 2026. దరఖాస్తుల పరిశీలన అనంతరం మెరిట్ జాబితా ఆధారంగా షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను సెప్టెంబర్ 2026లో వాక్-ఇన్ ప్రక్రియకు పిలవనున్నారు. ఈ అవకాశం ద్వారా ప్రభుత్వ రంగంలోని ప్రముఖ ఉక్కు సంస్థలో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేస్తే మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

