ఎమ్మెల్యే పరిటాల సునీత
విశాలాంధ్ర – ధర్మవరం;; ఎస్ ఐ ఆర్ యొక్క ఎనిమినేషన్ ఫారములు బిఎల్ఓలకు అందజేసేలా పార్టీ శ్రేణులు శ్రద్ధ వహించాలని ధర్మవరం డివిజన్ డివిజన్ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఈ సందర్భంగా రామగిరి మండలం వెంకటాపురంలోని తన క్యాంపు వారు మాట్లాడుతూ
ఎస్ఐఆర్ కు మరో 5రోజులు మాత్రమే గడువు ఉందని,ఇంకా ఎన్యుమరేషన్ ఫామ్ లు బిఎల్ఓలకు అందజేయాలని పార్టీశ్రేణులు చొరవ చూపారు. తదుపరి కార్యాలయం నుండి ఎస్ఐఆర్ పై సమీక్ష జరిగింది. పార్టీ శ్రేణులతో మాట్లాడి ఎన్యూమరేషన్ ఫామ్ లు ఎవరెవరు అందజేయలేదన్నది బిఎల్ఏలు ఇంటింటా పెళ్లి మరోసారి పరిశీలించాలన్నారు. మ్యాపింగ్ కానీ ఓట్లు, చనిపోయిన ఓట్లు, డబల్ ఓట్లు, డూప్లికెట్ , షిఫ్టింగ్ ఓట్ల వివరాలు పోలింగ్ బూత్ ల వారిగా బిఎల్ఏలు అందజేయాలన్నారు. వాటిని పరిశీలించి ఇంకా మిగిలి ఉన్న వారితో ఎన్యూమరేషన్ ఫామ్లు ఇప్పించేలా చూడాలని. అదే విధంగా 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని.. 18సంవత్సరాల వయసు ఉన్న వారిని కొత్త ఓటర్లుగా చేర్చే బాధ్యత తీసుకోవాలన్నారు. బిఎల్ఏలు ఈ 5రోజులపాటు అప్రమత్తంగా ఉంటూ మరోసారి డోర్ వెళ్లాలని సూచించారు. క్లాస్టర్, యూనిట్, మండల కన్వీనర్లు, ముఖ్య నాయకులు దీనిని నిర్వహించాలని సూచించారు.

