రవితేజ : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో తీస్తుండడంతో పాటు , తేజ తన రొటీన్ మాస్ కమర్షియల్ ఫార్ములా కి భిన్నంగా తీస్తుండడంతో ఆయన అభిమానుల్లోనే కాకుండా, మూవీ లవర్స్ లో కూడా ఈ చిత్రం ఆసక్తి చూపుతోంది. దానికి తోడు రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ బాగా పేలింది అంటే చెప్పాలి. గ్లింప్స్ వీడియో తో పాటు , ‘ఇరుముడి కట్టు’ పాట ఈ చిత్రం పై అప్పటి వరకు ఉన్నటువంటి అంచనాలను రెట్టింపు చేసింది. ఇకపోతే నేడే ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం డైరెక్టర్ శివ నిర్వాణ చాలా క్రియేటివ్ గా , ఒక వీడియో ద్వారా తెలియజేసారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ముందు గా ఈ చిత్రం లో రవితేజ కూతురు పాత్ర పోషించిన నక్షత్ర డబ్బింగ్ మొదలు పెడుతుంది. ఆమె ‘స్వామియే’ అనగానే , రవితేజ ‘శరణమయ్యప్ప’ అంటూ వస్తారు. ‘అప్పుడే డబ్బింగ్ మొదలు పెట్టావా బంగారం’ అని రవితేజ అనగా, ‘మీరు కూడా మొదలు పెట్టండి’ అని నక్షత్రం అంటుంది. ఈ వీడియోలో వీళ్లిద్దరి మధ్య ఉన్నటువంటి క్యూట్ బ్యాండింగ్ ని చూస్తుంటే, వెండితెర పై వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం అవుతోంది. ‘నాకు ఒకే ఒక్క కూతురు.. పేరు మణమ్మ’ అని రవితేజ డబ్బింగ్ మొదలు పెట్టడం , ఆ తర్వాత సినిమాలో కొన్ని విజువల్స్ చూపించడం వల్ల రవితేజ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రప్పించే మూమెంట్స్ అంటే చెప్పాలి.
తండ్రి, కూతురు మధ్య రిలేషన్ ని అద్భుతంగా వెండితెర పై ఆవిష్కరించిన సినిమా ఈ మధ్య కాలం లో రాలేదు. ఒకవేళ ఈ సినిమా ఆ విధంగా తీస్తే మాత్రం రవితేజ కం బ్యాక్ ఎవ్వరూ కలలో కూడా ఊహించని రీతిలో ఉంటుంది. అవలీలగా ఆయన ఈ మొదటి వారంలోనే వంద కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టగలడు. ఈ మూమెంట్ కోసం రవితేజ ఫ్యాన్స్ మాత్రమే కాదు , టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. మరి ఆ ఎదురు చూపులకు తగ్గ ఫలితం ఆగస్టు 21న ఈ సినిమాకు దక్కుతుందో లేదో చూడాలి. లేకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రముఖ కోలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ నటిస్తోంది.
#రవితేజ – బ్రో వాయిస్ మాత్రమే గూస్బంప్స్ అనుభూతిని ఇస్తుంది – వద్ద #ఇరుముడి సినిమా డబ్బింగ్.pic.twitter.com/oRyS9Epg8t
— GetsCinema (@GetsCinema) జూలై 20, 2026

