- సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్
- అంబేద్కర్ లా కాలేజీలో యువత ఆరోగ్యం..
- హక్కులు, భద్రత, జీవన నైపుణ్యాలపై అవగాహన
ముషీరాబాద్, వెలుగు: అనుమాదాస్పద వ్యక్తులతో ఆన్లైన్లో సంబంధాలు పెట్టుకోకుండా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సూచించారు. బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ లా కళాశాలలో సోమవారం యువత ఆరోగ్యం, హక్కులు, భద్రత, జీవన నైపుణ్యాలపై అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆన్లైన్ మోసాలు, సైబర్ వేధింపులు, సోషల్ మీడియా దుర్వినియోగంపై అప్రమత్తత అవసరమని, అవసరమైనప్పుడు 1930 హెల్ప్ లైన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. అలాగే, టి సేఫ్, షీ టీమ్స్ సేవల గురించి వివరించారు.
డాక్టర్ కె.అనురాధ సామాజిక సమానత్వంపై, డాక్టర్ అదితి షా ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జీవితంలో ఎదురయ్యే విజయానికి మెట్లుగా మార్చుకోవాలన్నారు.
డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఇన్ స్టిట్యూషన్స్ జైంట్ సెక్రెటరీ పీవీ.రమణ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సృజన, సీనియర్ జర్నలిస్ట్ ఉష, అర్చన, లెక్చరర్లు ఉన్నారు.

