– ప్రకటన –
నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలోని లోధి కాలనీ బీకే దత్ కాలనీలో మంగళవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఒక ఇంట్లో మంటలు చెలరేగడంతో 45 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు కూతుళ్లు (13 ఏళ్లు, 7 ఏళ్ల వయసు) సజీవదహనమయ్యారు. ఉదయం 10.21 గంటలకు పోలీసులకు అందిన సమాచారం మేరకు, బాధితులు పై అంతస్తులో చిక్కుకుపోయినట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి, లోపలికి ప్రవేశించేసరికి ముగ్గురూ మృతి చెందారు. షార్ట్ ప్రాథమిక కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
– ప్రకటన –

