OG 2 యానిమేషన్ వీడియో: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి ‘ఓజీ 2’. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఓజీ’ అనే గ్యాంగ్ స్టర్ డ్రామా , భారీ అంచనాల నడుమ గత ఏడాది విడుదలై , ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విడుదలకు ముందు ఈ సినిమా చూసినంత క్రేజ్ , హైప్ గతం లో ఏ సినిమా కూడా చూడలేదని , పవన్ కళ్యాణ్ మ్యాజిక్ లో యూత్ ఆడియన్స్ మునిగి తేలారని , విమర్శకులు సైతం చెప్పే మాటలు. ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు ప్రతీ ఒక్కటి పవన్ ఫ్యాన్స్ కి ఈ చిత్రం మధురమైన జ్ఞాపకాలను మిగిల్చింది. అలాంటి చిత్రీకరణ సీక్వెల్ అంటే ఎలాంటి క్రేజ్ రీసెంట్ గా ఉంటుందో ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన తాలూకు ప్రకంపనలు ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు.
త్వరలోనే ‘ఓజీ 2’ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ , సుజిత్ కలిసి మాట్లాడిన వీడియో సోషల్ మీడియా లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎక్కడ చూసినా దీని గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు. ముఖ్యంగా ఆ వీడియోలో సుజిత్ డ్రాగన్ పెట్ గురించి మాట్లాడడం , దాని పై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎన్నో వేల ఎడిటింగ్స్ చేయడం అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు. ఇదంతా పక్కన పెడితే , సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు కాబట్టి , ఈ చిత్రానికి సంబంధించి ఎదో ఒక అప్డేట్ కచ్చితంగా వస్తుందని అంతా అనుకున్నారు. అందరూ కోరుకున్నట్టే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతుంది. ఇది సినిమా కాన్సెప్ట్ ని తెలిపేలా , యానిమేషన్ రూపం లో ఉన్నట్లు సమాచారం.
దీనికి సంబంధించిన వర్క్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. త్వరలోనే ఫైనల్ ఔట్పుట్ సుజిత్ చేతుల్లోకి వెళ్లనుంది. కేవలం ప్రమోషనల్ కంటెంట్‌తో హైప్ చేయడం సుజిత్ కి వెన్నతో పెట్టిన విద్య. ఈ సినిమా కూడా అదే చేయబోతున్నాడు. కానీ సుజిత్ పై ఒక చిన్న కంప్లైంట్ ఉంది , ప్రమోషనల్ కంటెంట్ లో చాలా చూపిస్తారు కానీ , సినిమాలో మాత్రం చెప్పినవి చూపించారు , ఈసారైనా సుజిత్ ని నమ్మొచ్చా లేదా అనే సందేహాలు అభిమానుల్లో , ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నవంబర్ నుండి మొదలు కాబోతున్నాయట. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం.

