విశాలాంధ్ర – బొమ్మనహాళ్: బొమ్మనహాళ్ మండలం నేమకల్లు కొండల్లో ఎలుగుబంటి సంచారం స్థానికంగా కలకలం రేపింది. ఆహారం కోసం కొండపైకి వెళ్లిన ఎలుగుబంటి తిరిగి దిగేందుకు అనువైన లేక శిఖరంపై చిక్కుకుపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న శాఖ వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
నేమకల్లు కొండల్లోని క్వారీల్లో పనిచేస్తున్న కార్మికులు ఎలుగుబంటిని గుర్తించి వెంటనే శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి, బీట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ఎలుగుబంటి భయాందోళనలకు గురికాకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా సహజ ఆవాసమైన అడవిలోకి సురక్షితంగా వెళ్లేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొండ ప్రాంతంలోని క్వారీల్లో జరుగుతున్న కంకర తవ్వకాలను తాత్కాలిక శాఖ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. యంత్రాల శబ్దం, మానవ సంచారం వల్ల ఎలుగుబంటి మరింత భయపడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఎలుగుబంటికి ఎలాంటి హాని కలగకుండా సహజసిద్ధమైన మార్గంలో అడవిలోకి వెళ్లేలా పర్యాటకశాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్కడికి సమీపంలో నివసించే ప్రజలు, క్వారీ కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, ఎలుగుబంటి వద్దకు వెళ్లకుండా వెంటనే శాఖ అధికారులు సమాచారం అందించాలని సూచించారు.

