విశాలాంధ్ర ధర్మవరం;;నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పేరుతో విద్యార్థులను, టెట్ పరీక్షల పేరుతో ఉపాధ్యాయులను మానసిక ఇబ్బందికి గురిచేసినందుకు నైతిక బాధ్యత వహించే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ తక్షణం రాజీనామా చేయించారు యుటియఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి ,యూటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్మీ రామకృష్ణ జిల్లా ఎఫ్ ప్రధాన కార్యదర్శి ఆర్ నారాయణరెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ మేరీ
ఈ సందర్భంగా యుటియఫ్ నాయకులు మాట్లాడుతూ ఎన్టీఏ నిర్వహిస్తున్న నీట్ పరీక్ష లీకేజీ వల్ల 20మందికి పైగా విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నా స్పందించిన కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసే ఎన్ఐఏను రద్దు చేసి, నీట్ పరీక్షను రాష్ట్రాలు నిర్వహించుకునే విధంగా అవకాశం కల్పించాలని సూచించింది. నీట్ పరీక్షలు రద్దు, విద్యారంగ ప్రక్షాళన, విద్యామంత్రి తక్షణం రాజీనామా చేయాలని కోరుతూ పర్యావరణ, సామాజికవేత్త సోనమ్వాంగ్ చుక్ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను భగ్నంచేసి తీవ్రంగా ఖండిచారు.2010కంటే ముందు నియామకానికి స్పందించిన ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల దేశంలో 20లక్షల మందిపైగా ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురయ్యారు. 2010 ఏప్రిల్ నుండి అమలులోకి వచ్చిన విద్యాహక్కు చట్టంలో ఉపాధ్యాయుల నియామకానికి టెట్ అర్హత సాధించాలనే నిబంధన పెట్టారని, చట్టం అమలు నుంచి వర్తించాల్సిన నిబంధన, అమలుకు ముందు వర్తింపజేయడం సరికాదని తెలిపారు. విద్యా ఉపాధ్యాయ సంఘాలతో కనీసం చర్చించకుండా, ఉపాధ్యాయులకు కారణమైనహక్కు చట్టం సెక్షన్ 23(1) సవరణ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా ఉన్నా కేంద్రమంత్రి తక్షణం రాజీనామా చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రితో రాజీనామా చేయాలని, ఎన్డీఏను రద్దు చేసి నీట్ లాంటి పరీక్షలు నిర్వహించే విధంగా అవకాశం కల్పించాలని, టెట్ నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డివిజన్ యుటిఎఫ్ నాయకులు రామాంజనేయులు, పెద్దకోట్ల సురేష్, వెంకట కిషోర్, రాంప్రసాద్, కేజీవి నాగిరెడ్డి, గోపాలరావు, మణిమాల నిర్వహించారు.

