ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో అత్యుత్తమ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించకపోవడాన్ని మాజీ క్రికెటర్ మోయిన్ అలీ తప్పుబట్టాడు. వరల్డ్ బెస్ట్ స్పిన్నర్లలో ఒకడైన కుల్దీప్ యాదవ్ ఆడకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. వికెట్ టేకర్ అయిన 31 ఏళ్ల కుల్దీప్ యాదవ్.. భాగస్వామ్యాలను విడదీయడంలో దిట్ట అని చెప్పుకొచ్చాడు.
ఈ మూడు వన్డేల సిరీస్‌లో కుల్దీప్ యాదవ్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి వేదికలో ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోకి దిగింది. అక్షర్ పటేల్ ఒక్కడే స్పిన్నర్‌గా వ్యవహరించాడు. అయితే ఈ నిర్ణయం పూర్తిగా నష్టం చేసింది. భారత పేసర్లు చేతులెత్తేయడంతో ఇంగ్లండ్ 387 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసింది.
అతను వరల్డ్ బెస్ట్ స్పిన్నర్..
తాజాగా ఈ విషయంపై మాట్లాడిన మోయిన్ అలీ.. తాజాగా మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు. బుమ్రా లేకపోవడం కూడా భారత్ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. ‘కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు ఆడడం లేదో నాకు అర్థం కావడం లేదు. అతను ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడు.
భారత జట్టుకు అతను ఆదిల్ రషీద్ లాంటివాడు. భాగస్వామ్యాలను విడదీయడంలో దిట్ట. అతని బౌలింగ్‌ను అంచనా వేయడం బ్యాటర్లకు అంత సులువు కాదు. అతని తుది జట్టులో తప్పకుండా ఆడాలి. బ్యాటింగ్ డెప్త్ కోసం భారత జట్టు అతన్ని పక్కనపెడుతున్నట్లు అర్థమవుతోంది.
బుమ్రా లేకుంటే ఉత్తదే..
వారి బౌలర్లలో చాలా మంది బ్యాటింగ్ చేయలేకపోవడం సమస్యగా మారింది. బుమ్రా లేకుండా భారత బౌలింగ్ సాధారణంగా ఉంది. పిచ్ అనుకూలంగా ఉంటేనే వారు రాణించగలరు. కానీ వికెట్ ఫ్లాట్‌గా ఉంటే భారత బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఆఖరి వేదికలో బుమ్రా లేకపోవడం భారత జట్టుకు పెద్ద లోటు. అతను ఆరంభంలోనే వికెట్లు తీయడంలో.. పరుగులు కట్టడి చేయడంలో దిట్ట. అతను ఇతర బౌలర్లకు కూడా సహాయం చేస్తాడు. ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్లను కలిపితే బుమ్రా ఒక్కడు.’అని మోయిన్ అలీ చెప్పుకొచ్చాడు.
కథనం మొదట ప్రచురించబడింది: మంగళవారం, జూలై 21, 2026, 17:02 (IST)
ఇతర కథనాలు ప్రచురించబడ్డాయి జూలై 21, 2026

