బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుండి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజ హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ భాషలో చేసినా బాక్సాఫీస్ ఫలితం మారడం లేదు. రజనీకాంత్ కూలిలో ఐటెం సాంగ్ చేస్తే ఆ పాట ఒక్కటే హిట్టయ్యింది కానీ దాని వల్ల కలిగిన బెనిఫిట్ సున్నానే. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమా జన నాయకుడు లో ఆమె హీరోయిన్. బీస్ట్ తర్వాత మళ్ళీ ఈ కాంబో కుదిరింది. ఈ గురువారం విడుదలకు రంగం సిద్ధమయ్యింది.
అంతా బాగానే ఉంది కానీ జన నాయకుడు వల్ల పూజ హెగ్డేకు లాభం లేదు. దర్శకుడు హెచ్.వినోత్ చెబుతున్న దాని ప్రకారం తన పాత్ర ఎడిటింగ్ వల్ల మొక్కుబడిగా మారిపోయింది. మొదట జర్నలిస్టు క్యారెక్టర్లో ఎక్కువ సీన్లు రాసినప్పటికీ అన్ని షూట్ చేయలేకపోవడం, చేసిన వాటిలో కూడా లెన్త్ ఇష్యూ వల్ల కత్తిరించాల్సి రావడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో ఆమెకు క్షమాపణ కూడా చెప్పాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో పూజ కనిపించడం కొన్ని నిమిషాలేనని టాక్.
నిజానికి పూజ హెగ్డేకు చెప్పుకోదగ్గ హిట్టు దక్కి అయిదు సంవత్సరాలు దాటేసింది. ఇంత గ్యాప్ అంటే తిరిగి ఫామ్ లోకి రావడం కష్టం. అయినా సరే సూర్య, విజయ్, షాహిద్ కపూర్, సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్ లాంటి స్టార్ల సరసన ఛాన్స్ దక్కింది. ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. సరే రేంజ్ తగ్గినా పర్లేదని వరుణ్ ధావన్ తో హై జవానీతో ఇష్క్ హోనాహై చేస్తే అది కూడా దారుణంగా తుస్సుమంది. ఒకరకంగా చెప్పాలంటే తనను మన జనాలు మర్చిపోయారు.
ఇప్పుడు ఆశలన్నీ రాబోయే కాంచన 4 మీదే ఉన్నాయి. లారెన్స్ రాఘవేంద్ర భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ హారర్ మూవీలో పూజా హెగ్డే పాత్ర చాలా కీలకం. అందుకే దెయ్యాల సినిమా అయినా ఓకే చెప్పిందని టాక్. దుల్కర్ సల్మాన్ తో చేస్తున్న శ్రీశ్రీ కూడా చివరి దశలో ఉంది. యూత్ ని టార్గెట్ ఈ ఎంటర్టైన్ టైనర్ లో కాంచన 4కి పూర్తి వ్యతిరేకమైన చక్కని అమ్మాయి పాత్ర చేస్తోంది. మరి ఈ ఉత్పత్తులలో ఏది బ్రేక్ ఇస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.

