ఉత్తమ కెమెరా ఫోన్లు: బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం!
ప్రస్తుత స్మార్ట్ఫోన్లలో కెమెరా టెక్నాలజీ రోజురోజుకు తారస్థాయికి చేరుకుంటోంది. ఒకప్పుడు మెగాపిక్సెల్‌ల సంఖ్యపైనే పోటీ ఉండేది. కానీ, ఇప్పుడు పెద్ద సెన్సర్లు, ప్రీమియం లెన్స్‌లు, అధునాతన ఇమేజ్ ప్రాసెసింగ్, AI ఆధారిత ఫోటోగ్రాఫీ వంటి ఫీచర్లతో వినియోగదారులకు ప్రొఫెషనల్ కెమెరా అనుభవాన్ని అందిస్తున్నాయి. దీనితో ప్రత్యేకంగా పాయింట్-అండ్-షూట్ కెమెరా అవసరం లేకుండానే అద్భుతమైన ఫొటోలు, వీడియోలు తీసే అవకాశం లభిస్తోంది. ఫొటోగ్రఫీని ఇష్టపడేవారికి తాజాగా విడుదలైన వాటిలో కొనుగోలు చేయదగిన అత్యుత్తమ కెమెరా స్మార్ట్ఫోన్లు ఏవో చూసేద్దామా..
Vivo X300 అల్ట్రా:
వివో X300 అల్ట్రాను నిజమైన “పాకెట్ కెమెరా”గా తీసుకవచ్చారు. ఇందులో 200MP సోనీ LYTIA 901 సెన్సర్‌తో కూడిన 35mm మెయిన్ కెమెరా, 200MP 85mm గింబల్-స్టెబిలైజ్డ్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. Zeiss బ్రాండెడ్ లెన్స్‌లతో వచ్చే ఈ ఫోన్‌కు ప్రొఫెషనల్ ఇమేజింగ్ కిట్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో కెమెరా గ్రిప్‌తో పాటు 200mm, 400mm టెలికన్వర్టర్ లెన్స్‌లు ఉంటాయి. అలాగే 5MP స్పెక్ట్రల్ సెన్సర్, బ్లూప్రింట్ ఒరిజినల్ కలర్ కెమెరా టెక్నాలజీ ద్వారా సహజమైన రంగులతో ఫోటోలు క్యాప్చర్ చేయవచ్చు.
ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా:
ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా Hasselblad భాగస్వామ్యంతో తగయరైంది. ఇందులో 200MP మెయిన్ కెమెరా, 200MP టెలిఫోటో కెమెరా, 10x ఆప్టికల్ జూమ్ Hasselblad లెన్స్ ఉన్నాయి. 20x వరకు ఆప్టికల్ క్వాలిటీని కొనసాగించే సామర్థ్యం ఈ ఫోన్ ప్రత్యేకత. కొత్త LUMO ఆప్టికల్ జూమ్ టెక్నాలజీతో 2x, 6x జూమ్లలో కూడా క్లియర్ చిత్రాలు ఉన్నాయి. Hasselblad మాస్టర్ మోడ్ ద్వారా 8K ఫొటోలు తీయవచ్చు. ఇతర ఎర్త్ ఎక్స్‌ప్లోరర్ కిట్ ద్వారా కెమెరా గ్రిప్, టెలికన్వర్టర్, 67mm ఫిల్టర్ అడాప్టర్‌ను ఉపయోగించవచ్చు.
Apple iPhone 17 Pro:
యాపిల్ ఐఫోన్ 17 ప్రోలో మూడు 48MP కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఫ్యూజన్ కెమెరా, అల్ట్రా వైడ్, పెద్ద సెన్సర్‌తో కూడిన కొత్త టెలిఫోటో కెమెరా ఉన్నాయి. 4x ఆప్టికల్ జూమ్‌తో పాటు 200mm వద్ద 8x జూమ్‌ను కూడా అందిస్తుంది. A19 ప్రో చిప్, ఫోటోనిక్ ఇంజిన్ కలిసి అద్భుతమైన ఇమేజ్ ప్రాసెసింగ్‌ను అందిస్తాయి. ఫిజికల్ కెమెరా నియంత్రణలు ఎక్స్పోజర్, డెప్ట్, ఫొటోగ్రాఫిక్ స్టైల్స్‌ను సులభంగా మార్చుకోవచ్చు. 18MP ఫ్రంట్ కెమెరా, 4K డాల్బీ విజన్ 120fps వీడియో రికార్డింగ్, స్పేషియల్ ఆడియో వంటి ఫీచర్లు వీడియో క్రియేటర్లకు ఎంతో ఉపయోగపడతాయి.
Samsung Galaxy S26 Ultra:
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా తక్కువ వెలుతురులో అద్భుతమైన ఫొటోలు తీసే సామర్థ్యంతో మెప్పిస్తుంది. 200MP మెయిన్ కెమెరాకు f/1.4 అపర్చర్, 50MP అల్ట్రా వైడ్‌కు f/1.9 అపర్చర్ ఇవ్వడం వల్ల ఎక్కువ కాంతిని భద్రపరుస్తుంది. దీనితో నైటోగ్రఫీ ఫొటోలు, వీడియోలు మరింత నాణ్యతతో వస్తాయి. 10MP 3x టెలిఫోటో, 50MP 5x పెరిస్కోప్ లెన్స్‌లతో జూమ్ పనితీరు కూడా బాగా ఉంటుంది. అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ వీడియో (APV) సపోర్ట్, సూపర్ స్టెడీ స్టెబిలైజేషన్, AI వీడియో ఎడిటింగ్ టూల్స్ ఈ ఫోన్‌ను వీడియో షూటింగ్‌కు కూడా ఉత్తమ ఎంపికగా నిలబెట్టాయి.
Xiaomi 17 అల్ట్రా:
షియోమీ 17 అల్ట్రాలో Leica భాగస్వామ్యంతో రూపొందించిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 1-అంగుళం సెన్సర్‌తో మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్, 50MP 3x టెలిఫోటో, 50MP 5x పెరిస్కోప్ కెమెరాలు ఉన్నాయి. సర్జ్ ఇమేజింగ్ చిప్ లైకా కలర్ సైన్స్‌ను అందిస్తూ సహజమైన రంగులు, వేగవంతమైన షట్టర్ పనితీరును అందిస్తుంది. ఫోటోగ్రఫీ కిట్ ద్వారా రెండు దశల షట్టర్ బటన్, జూమ్ లివర్, 67mm ఫిల్టర్ థ్రెడ్ అందుబాటులో ఉన్నాయి.
Google Pixel 10 Pro XL:
గూగుల్ పిక్ సెల్ 10 ప్రో XL హార్డ్‌వేర్ కంటే AI ఆధారిత ఫోటోగ్రఫీపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రా వైడ్, 48MP 5x టెలిఫోటో కెమెరా ఉన్నాయి. Tensor G5 చిప్‌తో వచ్చే కెమెరా కోచ్ ఫీచర్ ఫ్రేమింగ్, లైటింగ్‌పై రియల్ టైమ్ సూచనలు ఇస్తుంది. ఆటో బెస్ట్ టేక్, మ్యాజిక్ క్యూ వంటి AI ఫీచర్లు గ్రూప్ ఫొటోలు, యాక్షన్ షాట్లను మరింత మెరుగ్గా మార్చుతాయి. 100x ప్రో-రెస్ జూమ్, వీడియో బూస్ట్ ద్వారా 8K వీడియో రికార్డింగ్ కూడా అందుబాటులో ఉంది.
Vivo X300 Pro:
Vivo X300 Pro, Ultra మోడల్‌కు తక్కువ ధరలో మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ప్రపంచంలో తొలిసారిగా 50MP సోనీ LYT828 మెయిన్ సెన్సర్‌ను ఉపయోగించిన ఈ ఫోన్లో 50MP అల్ట్రా వైడ్, 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. V3+, VS1 డ్యూయల్ ఇమేజింగ్ చిప్‌లతో 4K HDR సినీమాటిక్ పోర్ట్రెయిట్ వీడియోలను అద్భుతంగా రికార్డ్ చేయవచ్చు. Zeiss 2.35x టెలిఫోటో ఎక్స్టెండర్ కిట్‌కు కూడా ఈ ఫోన్ సపోర్ట్ ఇస్తుంది.

