కొడంగల్: నీట్ పశ్న పత్రాల లీకేజీ కేసుకు సంబంధించి మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆందోళనలను పోలీసులు కాంగ్రెస్ కరీల నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాందీ అరెస్ట్ చేశారు. విచారణ సిఎం రేవంత్ రెడ్డి నిరసన తెలిపారు. బుధవారం ఆయన కొడంగల్లదవ అంబేద్కర్ కూడలి వద్ద నిరసనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ ప్రశ్నపత్రాలను పల్లిబఠానీల్లా అమ్ముకున్నారని.
”లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ధర్మేంద్రప్రధాన్ చెలగాటం ఆడారు. ఆయన రాజీనామా చేసిన యువత ఆందోళన చేపట్టారు. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజా సమస్యలను ప్రస్తావించడం ప్రజా ప్రతినిధుల బాధ్యత. 20వ తేదీ నుంచి ప్రారంభమైన పార్లమెంట్ ఉభయసభల్లో.. ప్రశ్నా పత్రాల లీకేజీ అంశంపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అడిగినా ప్రభుత్వం అనుమతించలేదు. లోక్సభ స్పీకర్ అంగీకరించలేదు. ప్రజాస్వామ్యానికి ఇది దురదృష్టకరమైన పరిస్థితి. ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీని కొడితే ఆయన ముక్కు నుంచి రక్తం వచ్చింది. దేశం కోసం రక్తం చిందించడంలో రాహుల్ గాంధీ మొదటివారు కాదు. చివరివారూ కాదు. ఆనాడు మహాత్మ గాంధీ తెల్లదొరలతో కొట్లాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు. గాంధీజిని పొట్టన పెట్టుకున్న గాడ్సే వారసులు మీరు” అని బిజెపిపై రేవంత్ ఘాటు విమర్శలు చేశారు.

