రోహిత్ శర్మ భార్య: భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భార్య రితిక సజ్దే (రితికా సజ్దే) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) నిరసన కార్యక్రమంలో ఒక చిన్నారి మాట్లాడిన వీడియోను ఆమె రీ-షేర్ చేశారు.
లాఠీలకు భయపడను.. భగత్ సింగ్లా పోరాడతా: చిన్నారి
ఈ వైరల్ వీడియోలో ఆ చిన్న బాబు పీక్ టీవీ (PEEK TV) ఛానెల్‌తో మాట్లాడుతూ.. ధైర్యంగా, భావోద్వేగంగా స్పందించాడు. పోలీసుల లాఠీ దెబ్బలకు తాను అస్సలు భయపడేది లేదని ఆ పిల్లాడు చెప్పాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ మాదిరిగానే తాను కూడా దేశం కోసం పోరాడాలని అనుకుంటున్నట్లు ఆ కుర్రాడు తెలిపాడు. చిన్న వయసులోనే ఆ పిల్లాడు కనబరిచిన దేశభక్తి, భయం లేని వైఖరి ఉన్న వారందరినీ ఆకట్టుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున ఈలలు, కేరింతలకు కొట్టారు.
క్యాప్షన్ లేకుండానే రీ-పోస్ట్.. నెత్తింట జోరుగా చర్చ:
రితిక సజ్దే ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ ఎలాంటి వ్యక్తిగత కామెంట్ లేదా క్యాప్షన్ జోడించలేదు.. ఆమె తన సొంత అభిప్రాయాన్ని వ్యక్తపరచనప్పటికీ, రోహిత్ శర్మ భార్య ఈ వీడియోను షేర్ చేయడంతో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో అన్ని ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు.
పిల్లాడి మెసేజ్‌కు ఊహించని రీచ్:
ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు సంబంధించిన పలు వీడియోలు గత కొన్ని రోజులుగా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే, వాటిన్నింటిలో ఈ కుర్రాడి ప్రసంగం అత్యధికంగా షేర్ అయిన వీడియోలలో ఒకటిగా నిలిచింది. సాధారణంగా తన వ్యక్తిగత జీవితం, కుటుంబ విశేషాలతో పాటు తాను ఆకట్టుకునే అంశాలను సోషల్ మీడియాలో షేర్ చేసే రితిక, ఈ వీడియోను రీ-పోస్ట్ చేయడంతో అతడు చెప్పిన వ్యాఖ్యలు మరింత మందికి చేరువయ్యాయి.
నిరసనపై రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ఇన్‌స్టా స్టోరీ
-ఈ విషయాలన్నింటిలో ఆమె ఎప్పుడూ ఎందుకు జోక్యం చేసుకుంటుంది ??? రోహిత్ శర్మ 2027 ప్రపంచ కప్ మ్యాచ్ ఆడడం ఆమెకు ఇష్టం లేదు. pic.twitter.com/UbfbTXBqvo
– గగన్ చౌదరి (@trigguuuu) జూలై 22, 2026

