నందమూరి బాలకృష్ణ : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్రదర్శిస్తున్న సమయం లో అదుపు తప్పి బాలయ్య క్రింద పడిపోవడం తో ఆయన మోకాళ్ళకు గాయాలు అయ్యాయి. ఈ తక్షణమే ఆయనకు ప్రధమ చికిత్స అందించి హాస్పిటల్ కి చేరుకుంది. బాలయ్యకి చిన్నపాటి సర్జరీ అవసరమని డాక్టర్లు చెప్పడంతో ఆయన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కి తరలించి , AIG హాస్పిటల్ లో చేర్చారు. హైదరాబాద్ కి చేరుకున్న తర్వాత బాలయ్య ని హాస్పిటల్ కి తరలిస్తున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ వీడియో ని మీకోసం చివర్లో అందించాము చూడండి. అయితే కాసేపటి క్రితమే AIG హాస్పిటల్స్ బాలయ్య ఆరోగ్యానికి సంబంధించి లేటెస్ట్ బులిటెన్ ని విడుదల చేశారు.
వివిధ పరీక్షలు నిర్వహించిన తర్వాత , బాలయ్య మొకాలుకి దెబ్బ తగిలి , రక్తం గడ్డ కట్టిందని , సర్జరీ కి ఆయన మోకాలు అనుకూలిస్తుందని , త్వరలో విజయవంతంగా పూర్తి చేసినట్లు , అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే సర్జరీ తర్వాత బాలయ్య ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి అంటే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. కొంతమంది నెల రోజులు అని , మరి కొంతమంది 3 నెలల వరకు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందని సోషల్ మీడియా లో ప్రచారం. డాక్టర్లు క్లారిటీ ఇవ్వాలి. ఇకపోతే బాలయ్య కి ప్రమాదం జరిగిందనే విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ లతో పాటు జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ వంటి వారు కూడా విచారం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో ట్వీట్లు వేసిన సంగతి తెలిసిందే .
సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా బాలయ్య ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. అయితే ఈ వయస్సు లో కూడా ఇలాంటి సినిమా కోసం ఇలాంటి రిస్కీ స్టంట్స్ చేస్తున్న బాలయ్య పై సోషల్ మీడియాలో నెటిజెన్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. చిన్న చిన్న స్టంట్స్ కే డూప్స్ ని వాడుతున్న ఈ రోజుల్లో, 60 ఏళ్ల వయస్సులో కూడా సినిమా పట్ల బాలయ్య చూపిస్తున్న డెడికేషన్ కి సెల్యూట్ చేయాల్సిందే . ఆయన కోలుకొని , షూటింగ్ లో త్వరగా పాల్గొని , ఎప్పటిలాగే అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ పోస్టులు పెడుతున్నారు.

