రికవరీ పేరుతో డుమ్మా.. రీ-పేమెంట్ నమోదులో గోల్మాల్ ఆరోపణలు
వెలుగు నిర్లక్ష్యం.. మహిళా సంఘాల సభ్యుల ఆవేదన
విశాలాంధ్ర – విడపనకల్లు: విడపనకల్లు మండల కేంద్రంలోని సూర్యోదయ మండల సమాఖ్య (డీఆర్డీపీ–వెలుగు) అధికారుల సమయపాలన పూర్తిగా గాడిలో పడింది. పనివేళల్లో కార్యాలయానికి తాళం వేసి సిబ్బంది లేకపోవడంతో వివిధ గ్రామాల నుంచి వచ్చే పొదుపు మహిళా సంఘాల సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం విశాలాంధ్ర ప్రతినిధి మండల సమాఖ్య కార్యాలయాన్ని సందర్శించినప్పుడు, ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉండటంతో పాటు ఒక్క సిబ్బంది కూడా కనిపించలేదు. వివిధ పనుల నిమిత్తం వచ్చిన మహిళా సంఘాల సభ్యులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.ఈ విషయమై ఏపీఎం కాలనాయక్ను సంప్రదించగా, “స్టాఫ్ అందరమూ గడేకల్ గ్రామంలో రికవరీలో ఉన్నాం. కావాలంటే వచ్చి చూసుకోవచ్చు” అని సమాధానమిచ్చారు. మరోవైపు ఏరియా ఆర్డినేటర్ కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ శివప్రసాద్ సూచనప్రాయంగా, “అకౌంటెంట్ సెలవుల్లో.. వారు కార్యాలయ సిబ్బంది. అయినా కార్యాలయ సమయానికి తెరిచి ఉంచాల్సిందే. తాళం వేసి వెళ్లడంపై సమగ్రంగా జరుపుతాం” అని. ఒత్తిడి వచ్చిన సమయంలో క్రమం తప్పకుండా రుణ వాయిదాలు చెల్లించిన మహిళల చెల్లింపులను, బకాయిలు ఉన్న సభ్యుల ఖాతాల్లో నమోదు చేసుకున్న బాధితులు ఆరోపిస్తున్నారు.దీని ఫలితంగా తిరిగి రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, “మీ పేరుపై ఇంకా బకాయి ఉంది. ముందుగా అది చెల్లిస్తేనే కొత్త రుణం మంజూరవుతుంది” అంటూ అధికారులు తిరస్కరిస్తున్నారని మహిళలు వాపోతున్నారు. తమ సమస్యలను వివరించేందుకు కార్యాలయానికి వచ్చిన మహిళా సంఘాల సభ్యులతో అధికారులు దురుసుగా ప్రవర్తిస్తూ, ప్రశ్నిస్తే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆఫ్లైన్ రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, ఆన్లైన్ నమోదుపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించి వాస్తవాలు వెలికితీయాలని, అవకతవకలకు బాధ్యత కలిగిన వారిపై శాఖాపరమైన చర్యలు, కార్యాలయ వేళల్లో కార్యాలయాన్ని తప్పనిసరిగా తెరిచి ఉంచి మహిళా సంఘాలకు సకాలంలో సేవలు అందించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

