హైదరాబాద్ నగరంలో ఆక్రమణల బారిన పడిన చెరువులను పునరుద్ధరణ లక్ష్యంగా హైడ్రా సరికొత్త రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా మాదాపూర్ తమ్మిడికుంట, సున్నం చెరువు అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా పరిశీలించారు. రాబోయే ఆగస్టు మూడో వారానికల్లా ఈ రెండు చెరువుల పునరుద్ధరణ పనులను పూర్తి చేసి, ప్రారంభానికి సిద్ధం కావాల్సిన అధికారులను సిద్ధం చేసింది.
వర్షపు నీరు నేరుగా చెరువుల్లోకి చేరేలా ఇన్లెట్లను, చెరువులు నిండినప్పుడు నీరు సురక్షితంగా బయటకు వెళ్లేలా ఔట్లెట్లను నిర్మించాలని ఆయన సూచించారు. వీటితో పాటు చెరువుల చుట్టూ బలమైన బండ్, విశాలమైన వాకింగ్ పాట్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల కోసం ప్రత్యేక పార్కులు, ఓపెన్ జిమ్‌లు, పిల్లల ప్లే ఏరియాలను అందుబాటులోకి తెస్తున్నారు.
►ఇంకా చదవండి | ఛాంపియన్ అవ్వాలంటే కష్టపడాల్సిందే.. బ్రూస్ లీ జీవిత పాఠాలు చదవండి: మంత్రి వివేక్
చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా ఎస్టీపీ (STP) నిర్మాణాలను మెరుగుపరచడం, పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని కమిషనర్ సూచించారు. ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా తొలగించి, సున్నం చెరువు విస్తీర్ణాన్ని 16.4 ఎకరాల నుంచి 30.5 ఎకరాలకు, అలాగే తమ్మిడికుంట విస్తీర్ణంలో 16.2 ఎకరాల నుంచి 29.3 ఎకరాలకు పెంచడం.
వరద, భూగర్భ జలాల పెంపుతో పాటు ప్రజలకు పర్యావరణ పరిరక్షణ, వినోద సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా వాటిని మెరుగుపరచాలని అధికారులకు ఏవీ రంగనాథ్ సూచించారు.

