ఆంధ్రప్రదేశ్:అనంతపురం జిల్లా కదిరిలో భాగ్యరాజ్( కదిరిలో భాగ్యరాజ్ ) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది.తమ చావుకు కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్,సీఐ నాగేంద్ర ( కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, సీఐ నాగేంద్ర )కారణమంటూ వీడియోలో ఆరోపణలు చేశాడు.
ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్,సీఐ నాగేంద్ర తనను తీవ్రంగా వేధిస్తున్నారని,ఇంటి నుంచి వెళ్లిపోయే పరిస్థితి కల్పించారని భాగ్యరాజ్ వీడియోలో పేర్కొన్నారు.తమ కుటుంబానికి న్యాయం చేయాలని,తమ పరిస్థితికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.

