parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు చూసి వాటిని కూడా పొందాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో వారి తల్లిదండ్రులను అలాంటి వస్తువులు కావాలని ఫోర్స్ చేస్తారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు అడిగింది ఇవ్వాలన్న ఉద్దేశంతో వారు అడిగిన ప్రతి వస్తువును కొనుగోలు చేస్తారు. కానీ ఎంత మాత్రం మంచిది కాదని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సూచిస్తున్నారు. అలా అడిగిన ప్రతి వస్తువు కొనిస్తే వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయని.. ఇవి కష్టాలతో కూడుకొని ఉంటాయని. అసలు పిల్లలను ఎలా పెంచాలి?
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఇటీవల పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా పిల్లలు అడిగిన వెంటనే వస్తువు కొనిచ్చే అలవాటును మానుకోవాలి. ఎందుకంటే వారు అడిగిన ప్రతి వస్తువును కొనివ్వడం వల్ల వారికి కష్టం విలువ తెలియకుండా ఉంటుంది. కొన్నిసార్లు వారు అడిగే వస్తువులు తక్కువ ఖర్చుతో కూడుకొని ఉన్నా.. ఆ తర్వాత ఖరీదైన వస్తువుల విషయంలో కూడా మారే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి అప్పులు చేయాల్సిన అవసరం పిల్లలకు ఏర్పడుతుంది.అయితే కొంతమంది తల్లిదండ్రులు తమ సంతోషం కోసం అప్పులు చేసి మరి విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఇలా చేస్తే పిల్లల భవిష్యత్తు నాశనం అయ్యే ప్రమాదం ఉంది.
పిల్లలకు చిన్నప్పటి నుంచే డబ్బు విలువ గురించి తెలియజెప్పాలి. వారికి సాదాసీదా జీవితానికి అలవాటు చేయాలి. కష్టపడకుండా ఏది రాదని.. కష్టపడితేనే ప్రతి వస్తువును పొందే అవకాశం ఉంటుందని తెలియజెప్పాలి. కొన్ని అత్యవసర వస్తువులను అడిగిన వెంటనే కొనివ్వవచ్చు.. కానీ విలాస వస్తువుల విషయంలో మాత్రం ఆలస్యం చేయడమే మంచిదని అంటున్నారు. ఎందుకంటే విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఎంతో కష్టమైన పని అని పిల్లలకు చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల వారు కూడా విలాసవంతమైన వస్తువుల విషయంలో ఆలోచిస్తారు.
చాలావరకు తల్లిదండ్రుల జీవన విధానమే పిల్లల జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందువల్ల కొన్ని ఖరీదైన వస్తువులను పిల్లల ముందు తల్లిదండ్రులు కూడా కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా వారికి డబ్బు ముఖ్యం కాకుండా క్రమశిక్షణ కూడా చాలా అవసరం అని చెబుతూ ఉండాలి. ఎప్పుడైనా డబ్బు కష్టాలు ఎదురైనప్పుడు వాటి నుంచి తట్టుకుని సామర్థ్యం నేర్పించాలి. ఇలా చేయడం వల్ల వారికి ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుంది.

