- జంతర్ మంతర్‌లో సీజేపీ నిరసనలకు మెహబూబా ముఫ్తీ మద్దతు.
- పేపర్ లీక్, అవినీతిపై ఉద్యమాన్ని ప్రశంసించిన పీడీపీ చీఫ్.
- “దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం” అని వ్యాఖ్య.
మెహబూబా ముఫ్తీ: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సీజేపీ ఉద్యమానికి సపోర్ట్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గురువారం ఆమె నిరసనకు మద్దతు తెలిపారు. పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నిరసనల్ని రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, యువత భవిష్యత్తును కాపాడే పోరాటంగా అభివర్ణించారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తీవ్రమైన ఎండను తట్టుకుని నిరసనలు తెలుపుతున్న విద్యార్థులను అభినందించారు. ఈ ఉద్యమం అవినీతి, పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని ఇస్తుందని అన్నారు.
గత 12 ఏళ్లుగా దేశంలో విభజన రాజకీయాలు, అవినీతి, పేపర్ లీకులు, మహిళలపై నేరాలు పెరిగాయని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు మన దేశంలో పిల్లల కన్నా ఆవులే ఎక్కువ సురక్షితంగా ఉన్నాయని ఆమె ఉంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు న్యాయవ్యవస్థపై విమర్శలు చేశారు. ఇన్ని రోజులుగా విద్యార్థుల ఉద్యమం జరుగుతున్నా వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం లక్షల రూపాయలు ఖర్చు, యువత ఆందోళనను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక. ప్రభుత్వ అహంకారం ఎక్కువ రోజులు నిలవదని, యువత శక్తి కన్నా గొప్ప శక్తి లేదని, రాజ్యాంగాన్ని కాపాడేది యువతే అని ఆమె అన్నారు.

