మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరో శ్రీ విష్ణు కాంబినేషన్లో ‘సామజవరగమన’ ఫేమ్ హాసిత్ గోలి ఒక భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో రాబోతున్న ఈ పక్కా మాస్ కామెడీ ఎంటర్టైనర్లో రవితేజకు జోడీగా పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇక రవితేజతో పూజ నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. టాలీవుడ్లో మళ్లీ తన కోసం నిలబెట్టుకోవడానికి పూజ హెగ్డేకు ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్. ఒక వైపు కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్, మరోవైపు హాసిత్ గోలి మార్క్ కామెడీతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక శ్రీ విష్ణు సరసన హీరోయిన్ను ఎంపిక చేయాల్సి ఉంది. మేకర్స్ ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

