KMM CYBER CASE: ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన వెయ్యికోట్ల సైబర్ చీటింగ్ కేసులపై సిట్ ఏర్పాటైంది. సాయిబరాసురులు ఆడిన రాక్షస క్రీడను.. అమాయకుల పేరుతో బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ నేరాలకు వాడిన తీరును సిట్ బృందం వెలికి తీయనుంది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి డీఎస్పీ కె.వి. మురళీధర ప్రసాద్ నేతృత్వం వహించనున్నారు. ఇప్పటికే ఉన్న కేసులను స్వాధీనం చేసుకున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్తగా కేసు నమోదు చేసి ముందుకు వెళ్లనుంది. ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన రూ.1,000 కోట్లకు పైగా సైబర్ మోసాల కేసుల దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర పోలీసు అధికారులతో ఈ కేసులను సైబర్ సెక్యూరిటీకి బదిలీ చేశారు. ఇందులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో నమోదైన రెండు కేసుల ఆధారంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్తగా కేసు నమోదు చేసి సిట్ టీం దర్యాప్తు ప్రారంభించింది.
ఖమ్మం జిల్లా వి.ఎం. బంజారా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుతో పాటు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసును సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంలో సాంకేతిక ఆధారాలు, బ్యాంకు లావాదేవీలు, మనీలాండరింగ్ కోణాలపై సిట్ లోతైన విచారణ జరగనుంది. డీఎస్పీ కె.వి. మురళీధర ప్రసాద్ విచారణని ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఈ బాధ్యతలు అప్పగించారు. ప్రతి వారం దర్యాప్తు నివేదిక నివేదికను సమర్పించాలని ఆదేశాలు కూడా జారీ చేయబడ్డాయి.
ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు కొంత మంది కేటుగాళ్లు. ఆ ఖాతాలను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అలా తమ చేతుల్లో ఉన్న ఖాతాలను సైబర్ నేరాలకు వినియోగించారు. దేశంలో జరిగిన సైబర్ మోసాల సొమ్మును ఆయా ఖాతాల ద్వారా బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఈ ఖాతాల ద్వారా దాదాపు రూ.1,000 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇప్పుడివే అంశాలు సిట్ వెలికి తీయనుంది. ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ సైబర్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులు అరెస్ట్ అయ్యారు. మిగిలిన నిందితులు, వారికి సహకరించిన వ్యక్తులు, కంపెనీలు, బ్యాంకు ఖాతాల నెట్‌వర్క్‌పై సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేకంగా దృష్టి సారించారు. దర్యాప్తు వేగవంతం కావడంతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోత్రు ప్రవీణ్ ఉన్నాడు. పొత్రు కళ్యాణ్, మోరంపూడి చెన్నకేశవ రావు, జన్జునూరి శివకృష్ణ, ఉడుతనేని వికాస్.. ఈ భారీ చీటింగ్‌లో ఇతర నిందితులుగా ఉన్నారు.

