Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలబడడమే కాకుండా, ఈ ఏడాది అత్యధిక లాభాలను రాబట్టిన టాప్ 3 చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కొత్త సినిమాలు వచ్చినప్పటికీ ఈ చిత్రం ఇప్పటికీ స్టడీ వసూళ్లతో దూసుకెళ్తూ, అఖిల్ స్టామినా ఏంటో మరోసారి అందరికీ అయ్యేలా చేసింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు అఖిల్ చేసిన ప్రొమోషన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఒకవిధంగా ఈ ప్రొమోషన్స్ కూడా సినిమాపై జనాల్లో ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యాయి అని చెప్పొచ్చు. కేవలం ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ మాత్రమే కాకుండా, టీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా అఖిల్ చురుగ్గా ఉంటుంది.
అందులో భాగంగా ఆదివారం ప్రసారమయ్యే బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ షో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ లో అఖిల్ ఉంటుంది. ఆయనతో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ కూడా పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం కి అనేక మంది టీవీ సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్ గా వచ్చారు. వారిలో ‘బ్రహ్మముడి’ సీరియల్ హీరోయిన్ దీపిక కూడా ఉంది. ఈమె ఎంత సరదా మనిషి అనేది , రెగ్యులర్ గా ఎంటర్టైన్మెంట్ షో ని చూస్తే వాళ్లకు అర్థం అవుతుంది. ఈమె వచ్చిందంటే చాలు , షో మొత్తం సందడే. ఈమె అత్యుత్సాహం తో అతిధులను అప్పుడప్పుడు బెదరగొడుతూ ఉంటుంది. అలా అఖిల్ రాగానే ఈమె మాట్లాడిన మాటలు , అందుకు అఖిల్ వేసిన కౌంటర్లు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముందుగా దీపికా మాట్లాడుతూ ‘ఏమైనా సరే.. ఆరు అడుగుల యాపిల్ చెట్టు మీరు. పెడుతారా ఒక ముద్దు?’ అని అడగ్గా, ‘ముద్దు అయితే ఇవ్వలేను కానీ , రా హగ్గు ఇస్తాను’ అని హగ్ ఇచ్చారు అఖిల్.
అందుకు దీపిక ఎంతగానో మురిసిపోయింది. ఆ తర్వాత ‘అఖిల్ గారు.. మీ చేతిలో ఉన్నది బొంగరం, నా చేతికి వేస్తారా ఉంగరం’ అని అంటుంది దీపికా. అప్పుడు అఖిల్ ‘మా ఆవిడ సంగతి తెలీదు నీకు.. జాగ్రత్త’ అని నవ్వుతూ స్వీట్ వార్నింగ్ ఇస్తాడు అఖిల్. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీకోసం కింద అందించాము చూడండి. కొన్ని నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.

