హైదరాబాద్: మోదీ ప్రభుత్వం లీకేజీలతో విద్యార్థుల జీవితాలతో చెలగాడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వీ ధర్మాలో ఆయన కొనసాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరితో పెట్టుకోకూడదో వారితో పెట్టుకున్నారని కేటీఆర్ అన్నారు. యువత జవాబుదారీ తనం కోరుతున్నది. నేటి తరం గళమెత్తితే లోకమే శిరస్సు వంచిల్సిందేనని కేటీఆర్ చెప్పారు.
ప్రశ్నా పత్రం లీకేజీలో దోషులను శిక్షించాలని, మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. విద్యార్థుల ఉద్యమానికి బీఎస్ ఖచ్చితంగా అండటా నిలుస్తోంది. విద్యార్థులపై లాఠీ ఛార్జి చేసి ఈ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించకుండా సానుకూలంగా వ్యవహరించాలని కేటీఆర్ అన్నారు.

